Breaking News

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు బిగ్‌ షాక్‌..!

Published on Thu, 10/10/2024 - 20:32

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2024కి ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్‌​ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ కెమరూన్‌ గ్రీన్‌ బీజీటీ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తుంది. ముందుగా గ్రీన్‌ ఈ సిరీస్‌లో కేవలం బ్యాటర్‌గా మాత్రమే అందుబాటులో ఉంటాడని ప్రచారం జరిగింది. 

అయితే తాజా అప్‌డేట్‌ ప్రకారం గ్రీన్‌ బ్యాటర్‌గానూ కొనసాగే అవకాశం లేదని తెలుస్తుంది. గ్రీన్‌  అందుబాటులో లేకపోతే బీజీటీలో ఆసీస్‌ విజయావకాశాలు భారీగా దెబ్బతినే అవకాశం ఉంది. ఆసీస్‌ మీడియా కథనాల మేరకు గ్రీన్‌ మరో మూడు నెలలు క్రికెట్‌కు దూరంగా ఉంటాడని తెలుస్తుంది. గ్రీన్‌ వెన్ను సమస్యకు శస్త్ర చికిత్స అవసరమని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం.

కాగా, భారత్‌-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ నవంబర్‌ 22 నుంచి ప్రారంభం​ కానున్న విషయం తెలిసిందే. ఆసీస్‌లో జరిగే ఈ సిరీస్‌లో మొత్తం ఐదు టెస్ట్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలి టెస్ట్‌ నవంబర్‌ 22-26 మధ్యలో పెర్త్‌ వేదికగా జరుగనుండగా.. రెండో టెస్ట్‌ డిసెంబర్‌ 6-10 మధ్యలో అడిలైడ్‌ వేదికగా జరుగనుంది. 

మూడో టెస్ట్‌ బ్రిస్బేన్‌ వేదికగా డిసెంబర్‌ 14-18 మధ్యలో జరుగనుండగా.. నాలుగో టెస్ట్‌ మెల్‌బోర్న్‌ వేదికగా డిసెంబర్‌ 26-30 మధ్యలో జరుగనుంది. చివరి టెస్ట్‌ సిడ్నీ వేదికగా వచ్చే ఏడాది జనవరి 3-7 వరకు జరుగనుంది. ఈ సిరీస్‌ను ఇరు జట్లు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. ఈ సిరీస్‌ ఇరు జట్లను ప్రకటించాల్సి ఉంది.

చదవండి: ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌.. ఓటమి దిశగా పాక్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)