Breaking News

గుజ‌రాత్ టైటాన్స్‌లోకి ఆసీస్ విధ్వంస‌క‌ర వీరుడు?

Published on Thu, 09/04/2025 - 21:05

గుజరాత్ టైటాన్స్‌.. త‌మ ఐపీఎల్ అరంగేట్ర సీజ‌న్‌లోనే ఛాంపియ‌న్‌గా నిలిచి చ‌రిత్ర సృష్టించింది. ఐపీఎల్‌-2022 టైటిల్‌ను హార్దిక్ పాండ్యా  పాండ్యా సారథ్యంలోని గుజరాత్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత సీజన్‌లోనూ తమ జట్టును రన్నరప్‌గా హార్దిక్ నిలిపాడు.

కానీ అనుహ్యంగా ఐపీఎల్‌-2024కు ముందు  ట్రాన్స్‌ఫర్ విండో ద్వారా గుజరాత్ నుంచి ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత శుబ్‌మన్ గిల్ గుజరాత్ టైటాన్స్ బాధ్యతలు చేపట్టనప్పటికి జట్టును విజ‌య ప‌థంలో న‌డిపించ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. ఐపీఎల్‌-2025లో ప్లే ఆఫ్స్‌లో ఇంటిముఖం ప‌ట్టిన గుజ‌రాత్‌.. అంత‌క‌ముందు సీజ‌న్‌లో లీగ్ స్టేజిలోనే టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది.

హార్దిక్ గుజరాత్‌ను వీడి రెండు సీజ‌న్లు అవుతున్న‌ప్ప‌టి అత‌డి స్ధానాన్ని స‌రైన ఆట‌గాడు ఎవ‌రూ భ‌ర్తీ చేయ‌లేక‌పోయారు. హార్దిక్ బ్యాట్‌, బంతితో రాణించి గుజ‌రాత్ విజ‌యాల్లో భాగ‌మ‌య్యేవాడు. అయితే ఈసారి మినీవేలంలో అయినా హార్దిక్ త‌గ్గ ఆట‌గాడిని కొనుగోలు చేయాల‌ని గుజ‌రాత్ యాజ‌మాన్యం భావిస్తుందంట‌.

గ్రీన్‌పై క‌న్ను..?
ఐపీఎల్‌-2026 మినీ వేలం ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో జ‌ర‌గ‌నుంది. ఈ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ కామెరాన్ గ్రీన్‌పై గుజ‌రాత్ టైటాన్స్ కన్నేసిన‌ట్లు తెలుస్తోంంది. గ్రీన్ గాయం కార‌ణంగా గ‌తేడాది ఐపీఎల్ సీజ‌న్‌కు దూర‌మ‌య్యాడు. అయితే గాయం నుంచి కోలుకున్న గ్రీన్ వ‌చ్చే ఏడాది సీజ‌న్‌లో ఆడ‌నున్నాడు.

ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఆసీస్ త‌ర‌పున అద‌ర‌గొడుతున్నాడు. ఈ 26 ఏళ్ల ఆట‌గాడిని ఎలాగైనా సొంతం చేసుకోవాల‌ని గుజ‌రాత్ యోచిస్తున్న‌ట్లు ఐపీఎల్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ప్ర‌స్తుతం వైద్యుల సూచ‌న మేర‌కు కేవ‌లం   బ్యాటింగ్ మాత్ర‌మే చేస్తున్న గ్రీన్.. త్వ‌ర‌లోనే బౌలింగ్‌కు చేసేందుకు అందుబాటులో ఉండ‌నున్నాడు. 

గ్రీన్ ఇప్ప‌టికే ఐపీఎల్‌లో రెండు సార్లు రూ. 17.50 కోట్లు అమ్ముడుపోయాడు. ముంబై ఇండియ‌న్స్‌, ఆర్సీబీకి ప్రాతినిథ్యం వ‌హించాడు. గ‌త రెండేళ్ల‌లో టీ20ల్లో అత‌డి స్ట్రైక్ రేట్ 150 కంటే ఎక్కువగా ఉంది. ఐపీఎల్‌ 2026 వేలంలో అత్యంత డిమాండ్ ఉన్న ఆటగాళ్లలో ఒక‌డిగా గ్రీన్ ఉన్నాడు. గ్రీన్‌కు ఓ ఐపీఎల్ సెంచ‌రీ కూడా ఉంది.
 

Videos

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)