Breaking News

ఆల్‌ టైమ్‌ రికార్డు సమం​ చేసిన కెమరూన్‌ గ్రీన్‌

Published on Fri, 08/22/2025 - 16:23

ఆస్ట్రేలియా పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కెమరూన్‌ గ్రీన్‌ ఓ ఆల్‌టైమ్‌ రికార్డును సమం చేశాడు. ఆస్ట్రేలియా తరఫున ఓ వన్డేలో అత్యధిక ఔట్‌ ఫీల్డ్‌ క్యాచ్‌లు పట్టుకున్న ఆటగాడిగా మార్క్‌ టేలర్‌ (1992), మైఖేల్‌ క్లార్క్‌ (2004), ఆండ్రూ సైమండ్స్‌ (2006), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (2015), మిచెల్‌ మార్ష్‌ (2016), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (2017), లబూషేన్‌ (2024) సరసన చేరాడు. వీరంతా ఓ వన్డేలో తలో నాలుగు ఔట్‌ ఫీల్డ్‌ క్యాచ్‌లు పట్టారు.

ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో గ్రీన్‌ ట్రిస్టన్‌ స్టబ్స్‌, డెవాల్డ్‌ బ్రెవిస్‌, వియాన్‌ ముల్దర్‌, నండ్రే బర్గర్‌ క్యాచ్‌లు పట్టాడు. గ్రీన్‌తో పాటు మిగతా ఆసీస్‌ ఆటగాళ్లు కూడా మైదానంలో పాదరసంలా కదలి సత్తా చాటడంతో టాస్‌ గెలిచి తొలుత  బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా 49.1 ఓవర్లలో 277 పరుగులకు ఆలౌటైంది. 

మాథ్యూ బ్రీట్జ్కే (88), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (74) అర్ద సెంచరీలతో రాణించారు. టోనీ డి జోర్జి (38), వియాన్‌ ముల్దర్‌ (26), కేశవ్‌ మహారాజ్‌ (22 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రికెల్టన్‌ (8), మార్క్రమ్‌ (0), బ్రెవిస్‌ (1), ముత్తుసామి (4), బర్గర్‌ (8), ఎంగిడి (1) నిరాశపరిచారు. ఆసీస్‌ బౌలర్లలో ఆడమ్‌ జంపా 3, బార్ట్‌లెట్‌, నాథన్‌ ఎల్లిస్‌, లబూషేన్‌ తలో 2, హాజిల్‌వుడ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

అనంతరం 278 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌ తడబడుతూ బ్యాటింగ్‌ కొనసాగిస్తుంది. ఆ జట్టు 31 ఓవర్లలో 163 పరుగులకు సగం వికెట్లు కోల్పోయింది. ట్రవిస్‌ హెడ్‌ (6), మిచెల్‌ మార్ష్‌ (18), లబూషేన్‌ (1), గ్రీన్‌ (35), క్యారీ (13) ఔట్‌ కాగా.. జోస్‌ ఇంగ్లిస్‌ (78), ఆరోన్‌ హార్డీ (6) క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో బర్గర్‌ 2, ఎంగిడి, ముల్దర్‌, ముత్తుసామి తలో వికెట్‌ తీశారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో పర్యాటక సౌతాఫ్రికా తొలి వన్డే గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)