Breaking News

టీ20ల్లో ప్ర‌పంచ రికార్డు.. రెండు ఓవ‌ర్ల‌లో 71 పరుగులు! వీడియో

Published on Sun, 08/31/2025 - 07:28

కేర‌ళ క్రికెట్ లీగ్ 2025లో పెను సంచ‌ల‌నం నమోదైంది. శనివారం త్రివేండ్రం రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కాలికట్‌ గ్లోబ్‌స్టార్స్‌ బ్యాటర్‌ సల్మాన్‌ నిజార్ విధ్వంసం సృష్టించాడు. నిజార్‌ కేవలం 26 బంతుల్లోనే 12 సిక్సర్లతో 86 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.  తాను ఆడిన 26 బంతుల్లో అతను వరుసగా 1, 0, 1, 1, 6, 1, 0, 1, 1, 1, 2, 1, 1, 6, 6, 6, 6, 6, 1, 6, 2, 6, 6, 6, 6, 6 బాదాడు. 

నిజార్‌ 72 పరుగులు సిక్సర్ల ద్వారానే వచ్చాయి. తొలుత బ్యాటింగ్‌కు ఇబ్బంది పడ్డ నిజార్‌.. ఆఖరి రెండు ఓవర్లలో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బాసిల్‌ థంపి వేసిన 19వ ఓవర్లో తొలి ఐదు బంతుల్లో  వరుసగా 6, 6, 6, 6, 6 కొట్టిన అతను చివరి బంతికి సింగిల్‌ తీసి మళ్లీ స్ట్రైకింగ్‌కు వచ్చాడు. అభిజిత్‌ ప్రవీణ్‌ వేసిన ఆఖరి ఓవర్లో తొలి బంతికి సిక్స్‌ బాదగా, తర్వాతి బంతి వైడ్‌ అయింది. 

దాంతో అదనపు బంతికి 2 పరుగులు సాధించిన నిజార్‌...తర్వాతి ఐదు బంతుల్లో మళ్లీ వరుసగా 6, 6, 6, 6, 6 కొట్టి ముగించాడు. అత‌డి విధ్వంసం ఫ‌లితంగా కాలికట్‌ జట్టు చివరి 12 బంతుల్లో 71 ప‌రుగులు చేసింది. త‌ద్వారా టీ20 క్రికెట్‌లో ఆఖ‌రి రెండు ఓవ‌ర్ల‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన జ‌ట్టుగా కాలిక‌ట్ వ‌ర‌ల్డ్ రికార్డు నెల‌కొల్పింది. నిజార్‌ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌ కంటే ముందు అల్లెప్పీ రిపిల్స్‌పై కేవలం 26 బంతుల్లో 44 పరుగులు చేశాడు.

అంతేకాకుండా రంజీ ట్రోఫీ గత సీజన్‌లో కేరళ తరపున లీడింగ్‌ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. 86.71 యావరేజ్‌తో 607 పరుగులు నమోదు చేశాడు. ఈ క్రమంలో అతడిని ఐపీఎల్‌-2025 సీజన్‌కు ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ ట్రయల్స్‌కు పిలిచింది. కానీ వేలంలో అతడిని సీఎస్‌కే కొనుగోలు చేయలేదు.

ఇక ఈ మ్యాచ్‌ విషయానికి వస్తే.. త్రివేండ్రం రాయల్స్‌పై 13 పరుగుల తేడాతో కాలికట్ విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత కాలికట్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. అనంతరం 19.3 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌట్ అయింది.
చదవండి: T20 WC 2026: టీమిండియా ఓపెనర్లుగా ఊహించని పేర్లు!

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు