న్యూజిలాండ్‌కు భారీ షాక్‌.. హ్యాట్రిక్‌ వీరుడు దూరం

Published on Tue, 11/12/2024 - 14:12

న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్‌కు ముందు శ్రీలంకకు బిగ్ షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ స్పిన్న‌ర్ వ‌నిందు హ‌సరంగా తొడ కండ‌రాల గాయం కారంణంగా వ‌న్డే సిరీస్ మొత్తానికి దూర‌మ‌య్యాడు. దంబుల్లా వేదికగా కివీస్‌తో జ‌రిగిన రెండో టీ20లో హ‌సరంగా తొడ కండ‌రాలు ప‌ట్టేశాయి.

గాయంతో బాధ‌ప‌డుతూనే త‌న బౌలింగ్ కోటాను హ‌స‌రంగా పూర్తి చేశాడు. ఆ త‌ర్వాత బ్యాటింగ్‌లో కూడా వికెట్ల మధ్య కుంటుతూ క‌న్పించాడు. దీంతో అత‌డికి లంక మేనెజ్‌మెంట్ విశ్రాంతి ఇచ్చింది. అత‌డి స్ధానాన్ని దుషాన్‌ హేమంత‌తో శ్రీలంక క్రికెట్ భ‌ర్తీ చేసింది. 

దుషాన్ హేమంత శ్రీలంక త‌ర‌పున ఇప్ప‌టివ‌ర‌కు ఐదు వ‌న్డేలు ఆడాడు. ఇటీవ‌ల ఎమ‌ర్జింగ్ ఆసియాక‌ప్‌లో కూడా హేమంత అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ఈ క్ర‌మంలోనే అత‌డికి సెల‌క్ట‌ర్లు పిలుపునిచ్చారు. బుధ‌వారం దంబుల్లా వేదిక‌గా జ‌ర‌గ‌నున్న తొలి వ‌న్డేతో ఈ మూడు వ‌న్డేల‌ సిరీస్ ప్రారంభం కానుంది.

ఫెర్గూస‌న్‌కు గాయం..
మ‌రోవైపు న్యూజిలాండ్‌కు కూడా గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ పేస‌ర్ లాకీ ఫెర్గూస‌న్ మోకాలి గాయం కార‌ణంగా ఈ సిరీస్ నుంచి త‌ప్పుకున్నాడు. దంబుల్లా వేదిక‌గా లంక‌తో జ‌రిగిన రెండో టీ20లో ఫెర్గూస‌న్ గాయ ప‌డ్డాడు.

ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసి ఫెర్గూస‌న్ త‌న జ‌ట్టుకు సంచ‌ల‌న విజ‌యాన్ని అందించాడు. కానీ అంత‌లోనే గాయప‌డ‌డంతో సిరీస్ నుంచి వైదొల‌గాల్సి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో అత‌డి స్ధానాన్ని ఆడ‌మ్ మిల్నేతో సెల‌క్ట‌ర్లు భ‌ర్తీ చేశారు.
చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో మూడో టీ20.. టీమిండియా స్టార్ ప్లేయ‌ర్‌పై వేటు! అత‌డికి ఛాన్స్‌?

Videos

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)