ఇక వన్డేలపై బుమ్రా గురి!

Published on Wed, 03/11/2026 - 01:47

న్యూఢిల్లీ: భారత స్టార్‌ పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా వరుసగా రెండోసారి జట్టు టి20 ప్రపంచ కప్‌ను గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. 2024లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా నిలిచిన అతను... ఈసారి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఫైనల్‌’ అవార్డుతో తన విలువను ప్రదర్శించాడు. ‘ఆల్‌ ఫార్మాట్‌’ ప్లేయర్‌ అయిన బుమ్రా చాలా కాలంగా పనిభారం తగ్గించుకునేందుకు ఎంపిక చేసిన సిరీస్‌లు, మ్యాచ్‌లలోనే బరిలోకి దిగుతున్నాడు. ఈ క్రమంలో టి20 వరల్డ్‌ కప్‌ తర్వాత అతని ప్రాధాన్యతలు కూడా మారబోతున్నాయి. 

ఇకపై 2027 వన్డే వరల్డ్‌ కప్‌ లక్ష్యంగా బుమ్రా సిద్ధం కానున్నాడు. ఇందు కోసం రాబోయే ఏడాదిన్నర కాలంలో అతను ఎక్కువ వన్డే మ్యాచ్‌లు ఆడాలని నిర్ణయించుకున్నాడు. టి20 మ్యాచ్‌ల నుంచి చాలా వరకు అతను విరామం తీసుకునే అవకాశం ఉంది. ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడలతో పాటు 2028లో లాస్‌ ఏంజెలిస్‌లో జరిగే ఒలింపిక్స్‌ కూడా టి20 ఫార్మాట్‌లోనే జరుగుతాయి. అయితే ఈ రెండు మెగా ఈవెంట్లు మినహాయించి మిగతా టి20 మ్యాచ్‌లలో ఎక్కువ భాగం బుమ్రా ఆడే అవకాశం తక్కువగా ఉంది. 

ఐపీఎల్‌ ముగిసిన తర్వాత వన్డేలపైనే అతను పూర్తి స్థాయి దృష్టి పెడతాడు. అయితే వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ కూడా కీలకం కాబట్టి టెస్టుల నుంచి బుమ్రాకు విశ్రాంతి లభించడం కష్టమే. ఈ నేపథ్యంలో కోచ్‌ గంభీర్, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ హెడ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్, టెస్టు, వన్డే కెప్టెన్  శుబ్‌మన్‌ గిల్‌ కలిసి బుమ్రా గురించి పూర్తి స్థాయిలో చర్చించనున్నారు. బుమ్రా ఫిట్‌నెస్‌ తమకు అన్నింటికంటే ముఖ్యమని, పెద్ద ఈవెంట్లలో అతని ప్రాధాన్యత గురించి చెప్పాల్సిన పని లేదని, వరల్డ్‌ కప్‌కు ముందు ఉండే 30–35 వన్డేల్లో బుమ్రా బరిలోకి దిగుతాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.  

#

Tags : 1

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)