Breaking News

జస్ప్రీత్‌ బుమ్రా సూప‌ర్ బాల్‌..హెడ్ మైండ్ బ్లాంక్‌! వీడియో

Published on Thu, 12/26/2024 - 12:21

మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ టెస్టులో టీమిండియాకు ట్రావిస్ హెడ్ 'హెడేక్‌' త‌ప్పింది. ఈ నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హెడ్ డ‌కౌట‌య్యాడు. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా అద్బుత‌మైన బంతితో హెడ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.

దీంతో అత‌డు ఏడు బంతులు ఆడి ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్‌కు చేరాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 67వ ఓవ‌ర్ వేసిన బుమ్రా మూడో బంతిని హెడ్‌కు ఆఫ్ స్టంప్ దిశ‌గా గుడ్-లెంగ్త్ డెలివ‌రీగా సంధించాడు. అయితే ఆ బంతిని సరిగ్గా అంచనా వేయ‌లేకపోయిన హెడ్ వెనక్కి విడిచిపెట్టేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు.

కానీ వైడ్‌ ఆఫ్ స్టంప్ వెలుపుల ప‌డ్డ బంతి అద్బుతంగా స్వింగ్ అయ్యి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. బుమ్రా దెబ్బ‌కు హైడ్ మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. 

కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌పై ట్రావిస్‌ హెడ్‌ డకౌట్‌ కావడం ఇదే తొలిసారి. ఇక ఈ సిరీస్‌లో ఇప్పటికే హెడ్‌ విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. తొలి మూడు టెస్టుల్లో హెడ్‌ రెండు సెంచరీలను నమోదు చేసి భారత్‌కు తల నొప్పిగా మారాడు.

ఈ క్రమంలో నాలుగో టెస్టులో హెడ్‌ డకౌట్‌ కావడం భారత్‌ కలిసొచ్చే ఆంశంగా చెప్పాలి. ఇక 83 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది.
 

చదవండి: #Virat Kohli: యువ క్రికెటర్‌తో గొడవ.. విరాట్‌ కోహ్లికి ఐసీసీ భారీ షాక్

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)