Breaking News

అత‌డొక వర‌ల్డ్‌క్లాస్ బౌల‌ర్‌.. చ‌రిత్ర‌లో నిలిచిపోతాడు: లారా

Published on Sat, 06/22/2024 - 17:15

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో జోరు మీద ఉన్న టీమిండియా.. ఇప్పుడు మ‌రో కీల‌క పోరుకు సిద్ద‌మైంది. ఈ మెగా టోర్నీ సూప‌ర్‌-8లో భాగంగా అంటిగ్వా వేదిక‌గా శ‌నివారం బంగ్లాదేశ్‌తో భార‌త్‌ త‌ల‌ప‌డ‌నుంది. 

ఈ మ్యాచ్‌కు భార‌త్ అన్ని విధాల సిద్ద‌మైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకోవాల‌ని రోహిత్ సేన భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాపై వెస్టిండీస్ క్రికెట్ దిగ్గ‌జం బ్రియాన్ లారా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. 

బుమ్రా వ‌ర‌ల్డ్‌క్లాస్ బౌల‌ర్ అని లారా కొనియాడాడు. కాగా ఈ మెగా టోర్నీలో బుమ్రా అద్బుతమైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నాడు. ఈ టోర్నీలో ఇప్ప‌టివ‌ర‌కు 4 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా.. 8 వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్‌పై విజ‌యంలో కూడా బుమ్రా కీల‌క పాత్ర పోషించాడు.

"జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ స్థాయి బౌలర్. వ‌ర‌ల్డ్ క్రికెట్‌లో ఇటువంటి బౌల‌ర్లు చాలా అరుదుగా ఉంటారు. బుమ్రా లాంటి బౌల‌ర్ జ‌ట్టులో ఉండాల‌ని ప్ర‌తీఒక్క‌రూ కోరుకుంటున్నారు. మా జ‌ట్టులో కూడా బుమ్రా లాంటి పేస్ గుర్రం ఉంటే బాగుండేది అనిపిస్తోంది. 

అందుకే రెండు  రోజుల క్రితం నేను  స‌ర‌దాగా కొన్ని వ్యాఖ్య‌లు చేశాను. బుమ్రా వెస్ట్రన్ ఈస్ట్‌లో ఉండి వెస్టిండీస్‌కు ప్రాత‌నిథ్యం వ‌హించాలంటే పాస్‌పోర్ట్‌తో స‌హా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామ‌ని చెప్పాను. కానీ అది జ‌ర‌గ‌దు(న‌వ్వుతూ). ఇక టీమిండియాతో మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్ ప్లేయ‌ర్ల‌కు ఒక్క స‌ల‌హా ఇవ్వాల‌న‌కుంటున్నాను. 

మీరు బుమ్రాను ఎటాక్ చేయడానికి ప్ర‌య‌త్నిస్తే భారీ మూల్యం చెల్లించుకోక‌త‌ప్ప‌దు. భార‌త్‌పై బంగ్లాదేశ్ విజయం సాధించాలంటే ఎట్టిప‌రిస్థితుల్లోనూ బుమ్రాను టార్గెట్ చేయ‌కూడదు. 

ఎందుకంటే బుమ్రాను టార్గెట్ చేస్తే బంగ్లా వ‌రుస క్ర‌మంలో వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను భార‌త్‌కు స‌మ‌ర్పించుకోవాల్సి ఉంటుందని" లారా పేర్కొన్నాడు. అదేవిధంగా మెక్‌గ్రాత్‌, ఆంబ్రోస్, వసీం అక్రమ్ టాప్ క్లాస్ బౌలర్‌లలో ఒకడిగా బుమ్రా నిలిచిపోతాడని లారా ప్రశంసించాడు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)