Breaking News

T20 వరల్డ్‌కప్‌కు లారా భారత జట్టు ఇదే.. ఊహించని ప్లేయర్‌కు ఛాన్స్‌

Published on Mon, 04/29/2024 - 17:44

టీ20 వరల్డ్‌కప్‌-2024కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ మరో 48 గంటల్లో ప్రకటించనుంది. ఈ జట్టులో ఎవరికి చోటు దక్కుతుందా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఐపీఎల్‌-2024లో ఆటగాళ్ల ప్రదర్శనను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోకున్నారు. వరల్డ్‌కప్‌ జట్టులో కొన్ని అనూహ్య ఎంపికలు ఉండే అవకాశముందని క్రికెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్‌ కోసం వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఎంచుకున్నాడు. 

తన జట్టులో టీమిండియా ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌, నయా ఫినిషర్‌ రింకూ సింగ్‌, స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌లకు చోటు ఇవ్వలేదు. లారా తన జట్టులో టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్‌కు ఛాన్స్‌ ఇచ్చాడు. 

అదే విధంగా స్పెషలిస్ట్‌ వికెట్‌ కీపర్ల కోటాలో సంజూ శాంసన్‌, రిషబ్ పంత్‌లను లారా ఎంపిక చేశాడు. ఆల్‌రౌండర్లగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శివమ్ దూబేలకు చోటు దక్కింది. 

ఇక ఫాస్ట్‌ బౌలర్ల కోటాలో అనూహ్యంగా సందీప్ శర్మను లారా ఎంపిక చేశాడు. అతడితో పాటు పేస్‌ సంచలనం మయాంక​్‌ యాదవ్‌కు సైతం లారా అవకాశమిచ్చాడు.

వీరిద్దరితో పాటు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌లకు ఫాస్ట్‌ బౌలర్లగా బ్రియాన్‌ ఎంపిక చేశాడు. ఇక చివరగా లారా జట్టులో స్పిన్నర్లగా కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ చోటు దక్కించుకున్నారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)