Breaking News

‘రికార్డులు ఉన్నది తిరగరాయడానికే’

Published on Sat, 07/12/2025 - 08:06

జొహన్నెస్‌బర్గ్‌: క్రీడల్లో ఏ రికార్డూ శాశ్వతం కాదని వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా అన్నాడు. ఇటీవల జింబాబ్వేతో రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ వియాన్‌ ముల్డర్‌ అజేయంగా 367 పరుగులు చేశాడు. మ్యాచ్‌ పరిస్థితులను బట్టి చూస్తే సఫారీ జట్టుకు చాలా సమయం ఉండగా... సారథ్య బాధ్యతలు కూడా అతడి వద్దే ఉండటంతో ముల్డర్‌ టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన లారా (400) రికార్డును బద్దలు కొడతాడని అందరూ భావించారు.

అయితే అందుకు భిన్నంగా ముల్డర్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి ఆశ్చర్యపరిచాడు. అనంతరం అతడు మాట్లాడుతూ... విండీస్‌ దిగ్గజం లారాపై గౌరవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ అంశంపై లారా తనతో ముచ్చటించినట్లు ముల్డర్‌ పేర్కొన్నాడు. ‘లారాతో ఇటీవలే దీని గురించి మాట్లాడా. రికార్డులు ఉన్నవి బద్దలు కొట్టేందుకే అని చెప్పాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు కోసం ప్రయతి్నంచి ఉండాల్సిందన్నాడు. నీకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కేదని ప్రోత్సహించాడు. 

మరోసారి అలాంటి అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని సూచించాడు. అది అతడి గొప్పతనం. నా వరకైతే నేను చేసింది సరైందే. ఆ రికార్డు అతడి లాంటి లెజండ్‌ పేరిట ఉండటమే సబబు’ అని ముల్డర్‌ అన్నాడు. ఈ క్రమంలో టెస్టు క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్ల జాబితాలో ముల్డర్‌ ఐదో స్థానానికి చేరాడు.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)