ఇంగ్లండ్‌ వన్డే, టీ20 జట్ల హెడ్‌ కోచ్‌గా మెక్‌కల్లమ్‌

Published on Tue, 09/03/2024 - 19:40

ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్ల హెడ్‌ కోచ్‌గా న్యూజిలాండ్‌ మాజీ వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు ఇవాళ (సెప్టెంబర్‌ 3) అధి​కారికంగా ప్రకటించింది. మెక్‌కల్లమ్‌ 2022 నుంచి ఇంగ్లండ్‌ టెస్ట్‌ జట్టుకు హెడ్‌ కోచ్‌గా ఉన్నాడు. అతని కాంట్రాక్ట్‌ను ఈసీబీ 2027 వరకు పొడిగించింది. 

మెక్‌కల్లమ్‌ పూర్తి స్థాయి ఇంగ్లండ్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా వచ్చే ఏడాది జనవరి నుంచి బాధ్యతలు చేపడతాడు. భారత్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌ నుంచి మెక్‌కల్లమ్‌ ప్రస్తానం మొదలుకానుంది. అనంతరం జరిగే ఛాంపియన్స్‌ ట్రోఫీలోనూ మెక్‌కల్లమ్‌ ఇంగ్లండ్‌ హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తాడు. 

వచ్చే ఏడాది జనవరి వరకు ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల జట్ల తాత్కాలిక హెడ్‌ కోచ్‌గా మార్కస్‌ ట్రెస్కోథిక్‌ వ్యవహరిస్తాడు. త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌కు, ఆతర్వాత విండీస్‌ పర్యటనకు ట్రెస్కోథిక్‌ ఇంగ్లండ్‌ హెడ్‌ కోచ్‌గా పని చేస్తాడు. 

కాగా, ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల జట్ల హెడ్‌ కోచ్‌గా ఉన్న మాథ్యూ మాట్స్‌ ఇటీవలే బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. మాట్స్‌ ఇంగ్లండ్‌ హెడ్‌ కోచ్‌గా 2022లో ఛార్జ్‌ తీసుకున్నాడు. అయితే అతను అనివార్య కారణాల వల్ల తన నాలుగేళ్ల కాంట్రాక్ట్‌ను పూర్తి చేయకుండా మధ్యలోనే వైదొలిగాడు. మాట్స్‌ వైదొలిగిన నెల వ్యవధిలోనే ఈసీబీ మెక్‌కల్లమ్‌ను వన్డే, టీ20 జట్లకు హెడ్‌ కోచ్‌గా నియమించింది. మాట్స్‌ ఆధ్వర్యంలో ఇంగ్లండ్‌ 2022 టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

 

 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)