Breaking News

ఇదొక అద్భుత‌ నిర్ణయం.. నిజంగా నమ్మలేకపోతున్నాను: బెన్‌ స్టోక్స్‌

Published on Thu, 09/05/2024 - 09:38

ఇంగ్లండ్ పురుషుల జ‌ట్టు ప‌రిమిత ఓవ‌ర్ల హెడ్‌కోచ్‌గా న్యూజిలాండ్ దిగ్గ‌జం బ్రెండ‌న్ మెకల్ల‌మ్ ఎంపికైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం టెస్టుల్లో ఇంగ్లండ్ ప్ర‌ధాన కోచ్‌గా ఉన్న మెక‌ల్ల‌మ్‌కు ఆదేశ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్ర‌మోష‌న్ ఇచ్చింది. 

ఇకపై మూడు ఫార్మాట్ల‌లో ఇంగ్లీష్ జ‌ట్టు హెడ్‌కోచ్‌గా మెక‌ల్ల‌మ్ వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. స్వ‌దేశంలో ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌నున్న టీ20 సిరీస్‌తో వైట్‌బాల్ కోచ్‌గా మెక‌ల్ల‌మ్ త‌న ప్ర‌య‌ణాన్ని ప్రారంభించ‌నున్నాడు.

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో వైఫ‌ల్యం త‌ర్వాత ఇంగ్లండ్ హెడ్‌కోచ్ ప‌ద‌వి నుంచి మాథ్యూ మోట్ త‌ప్పుకోవ‌డంతో కొత్త కోచ్ ఎంపిక అనివార్య‌మైంది. ఇక వైట్‌బాల్ కోచ్ మెక‌ల్ల‌మ్‌ ఎంపికపై ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ తాజాగా స్పందించాడు. ఇదొక సంచ‌ల‌న నిర్ణయ‌మ‌ని స్టోక్స్ అన్నాడు.

"మెక‌ల్ల‌మ్ మా జ‌ట్టు వైట్ బాల్ కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం చాలా సంతోషంగా ఉంది. తొలుత ఈ వార్త విని చాలా ఆశ్చ‌ర్య‌పోయాను. అన్ని ఫార్మాట్ల‌లో మెకల్ల‌మ్ కోచ్‌గా ఎంపిక అవ్వ‌డం ఇంగ్లండ్ క్రికెట్ ప్ర‌పంచంలో తిరిగిలేని శ‌క్తిగా అవ‌త‌రిస్తుంది.

ఇదొక అద్భుత‌మైన నిర్ణ‌యం. అత‌డు ఇప్ప‌టికే కోచ్‌గా టెస్టుల్లో ఏమి సాధించాడో మ‌నం చూశాం. ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో కూడా బాజ్‌(మెక‌ల్ల‌మ్‌)తో క‌లిసి పనిచేసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాను. అతడికి వైట్‌బాల్ క్రికెట్‌లో చాలా అనుభవం ఉంది.

అదే విధంగా బట్లర్ కూడా మెక‌ల్ల‌మ్‌తో కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉన్నడాని నేను భావిస్తున్నాను. చాలా మంది కొత్త ఆటగాళ్లు కూడా మెకల్లమ్ గైడన్స్‌లో ఆడేందుకు సముఖత చూపుతారు. ఇది యువ ఆటగాళ్లకు మంచి అవకాశమని" ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టోక్సీ పేర్కొన్నాడు.
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)