Breaking News

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మెంటార్‌గా బ్రావో

Published on Sat, 09/28/2024 - 04:17

న్యూఢిల్లీ: టి20 క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న వెస్టిండీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే)తో తన సుదీర్ఘ అనుబంధానికి ముగింపు పలికాడు. 2025 ఐపీఎల్‌ సీజన్‌ నుంచి అతను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) టీమ్‌కు మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. గత ఏడాది ఈ బాధ్యతలు నిర్వర్తించిన గౌతమ్‌ గంభీర్‌ భారత జట్టు హెడ్‌ కోచ్‌గా వెళ్లగా, అతని స్థానంలో బ్రావోను ఎంచుకున్నట్లు కేకేఆర్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది. 

నైట్‌రైడర్స్‌ హెడ్‌ కోచ్‌ చంద్రకాంత్‌ పండిత్, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌లతో కలిసి అతను పని చేస్తాడు. కేకేఆర్‌ టీమ్‌ యాజమాన్యానికి చెందిన ఇతర టి20 జట్లు ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్, లాస్‌ ఏంజెల్స్‌ నైట్‌రైడర్స్, అబుదాబి నైట్‌రైడర్స్‌లకు కూడా ఇన్‌చార్జ్‌గా ఉండేలా ఈ గ్రూప్‌తో బ్రావో దీర్ఘకాలిక కాంట్రాక్ట్‌ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ ప్రకటనకు ముందు రోజే గురువారం తాను ఆటగాడిగా అన్ని స్థాయిల నుంచి రిటైర్‌ అవుతున్నట్లు బ్రావో ప్రకటించాడు. 

ఐపీఎల్‌ ఆరంభంలో ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడిన బ్రావో 2011 నుంచి 2022 వరకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులో సభ్యుడు. మధ్యలో రెండేళ్లు చెన్నైపై నిషేధం ఉన్న సమయంలో అతను గుజరాత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. సీఎస్‌కే తరఫున ఆడిన 10 సీజన్లలో 3 సార్లు టైటిల్‌ గెలిచిన జట్టులో అతను ఉన్నాడు. రిటైర్‌ అయ్యాక గత రెండు సీజన్లు చెన్నైకే బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరించిన బ్రావో ఇప్పుడు ఆ జట్టుకు దూరమయ్యాడు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)