9 ఎడిషన్ల తర్వాత వేలం.. ఖరీదైన ఆటగాడు అతడే..!

Published on Mon, 12/01/2025 - 12:31

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL)లో తొమ్మిది ఎడిషన్ల తర్వాత మళ్లీ ఆటగాళ్ల వేలం జరిగింది. 2012లో తొలి సీజన్‌ వేలం తర్వాత ఇప్పటివరకు డ్రాఫ్ట్ విధానం అమల్లో ఉండింది. అయితే రాబోయే సీజన్‌ కోసం ఈసారి ఆటగాళ్ల వేలం నిర్వహించారు.  

ఈ వేలంలో బంగ్లాదేశ​్‌ జాతీయ జట్టు ఓపెనర్‌ మొహమ్మద్ నయీమ్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. నయీమ్‌ను చిట్టగాంగ్ రాయల్స్ BDT 1 కోటి (USD 88000)కు కొనుగోలు చేసింది. ఈ వేలంలో కోటి టాకాల మార్క్ దాటిన ఏకైక ఆటగాడు నయీమే కావడం విశేషం.  

నయీమ్‌ తర్వాత అత్యధిక ధర పలికిన ఆటగాళ్లుగా తౌహిద్‌ హ్రిదోయ్‌, లిట్టన్‌ దాస్‌ నిలిచారు. వీరిద్దరినీ రంగ్‌పూర్ రైడర్స్ ఫ్రాంచైజీనే సొంతం చేసుకుంది. హ్రిదోయ్‌ USD 73600కు, లిట్టన్ దాస్‌ USD 56,000కు అమ్ముడుపోయారు.

బంగ్లాదేశీ వెటరన్‌ స్టార్లు మహ్ముదుల్లా, ముష్ఫికుర్ రహీమ్ కోసం తొలుత ఏ ఫ్రాంచైజీ బిడ్ చేయకపోయినా, చివరికి మహ్ముదుల్లాను రైడర్స్, ముష్ఫికుర్‌ను రాజ్‌షాహి వారియర్స్  వారి బేస్ ప్రైస్ BDT 35 లక్షలకు దక్కించుకున్నాయి.

ఈ వేలంలో విదేశీ ప్లేయర్లు వందల సంఖ్యలో పాల్గొన్నా 90 శాతానికి పైగా అమ్ముడుపోకపోవడం మరో విశేషం. ఈ కేటగిరిలో శ్రీలంక ఆల్‌రౌండర్ దసున్ షనకకు అత్యధిక ధర దక్కింది. ఇతన్ని ఢాకా క్యాపిటల్స్ USD 55000కు కొనుగోలు చేసింది.

కాగా, ఈ సీజన్‌ బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ డిసెంబర్ 26 నుంచి జనవరి 23 వరకు జరగనుంది. ఈ సీజన్‌లో పాల్గొనే జట్లు.. ఢాకా క్యాపిటల్స్, రంగ్‌పూర్ రైడర్స్, రాజ్‌షాహి వారియర్స్, నోయాఖాలి ఎక్స్‌ప్రెస్, సిల్హెట్ టైటాన్స్, చిట్టగాంగ్ రాయల్స్.  

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)