‘ఆస్ట్రేలియాను టీమిండియా వైట్‌వాష్‌ చేస్తుంది’

Published on Fri, 02/17/2023 - 09:25

బోర్డర్-గవాస్కర్ సిరీస్‌ తొలి టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా.. ఇప్పడు ఢిల్లీ వేదికగా జరగనున్న రెండో టెస్టులో కూడా సత్తా చాటాలాని భావిస్తోంది. మరోవైపు ఆసీస్‌ కూడా ఢిల్లీ టెస్టులో గెలిచి సిరీస్‌ సమం చేయాలని తమ ఆస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. ఇక కీలకమైన రెండో టెస్టు నేపథ్యంలో న్యూజిలాండ్‌ క్రికెట్‌ దిగ్గజం సైమన్ డౌల్ జోస్యం చెప్పాడు.  బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను టీమిండియా వైట్‌వాష్‌ చేస్తుందని సైమన్ డౌల్ జోస్యం చెప్పాడు.

"బోర్డర్‌- గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా కనీసం ఒ‍క్క టెస్టులోనైనా విజయం సాధించినా చాలు.. అది నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మ్యాచ్‌లకు వర్షం అంతరాయం లేకుండా జరిగితే.. భారత్‌ కచ్చితంగా 4-0 తేడాతో ఆసీస్‌ను వైట్‌వాష్‌ చేస్తుందని అని భావిస్తున్నాను. కానీ ఆస్ట్రేలియా బాల్‌తో గాని, స్మిత్‌, లబుషేన్‌ వంటి వారు బ్యాట్‌తో అద్భుతంగా రాణిస్తే.. కంగారూలు ఒక టెస్టు మ్యాచ్‌ గెలిచే అవకాశం ఉంది. 

అదే విధంగా కొంతమంది నాగ్‌పూర్‌ టెస్టులో పిచ్‌ని తమకు అనుకూలంగా భారత్‌ తయారు చేసుకుందని ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఆస్ట్రేలియా కూడా తమ సొంత గడ్డపై పిచ్‌లను తమకు అనూకూలంగా తయారుచేసుకుంటుంది. అదేమి కొత్త విషయం కాదు. అయితే ఆసీస్‌ ఓటమికి స్పిన్‌ ఒక్కటే సమస్య కాదు.

ఆసీస్‌ జట్టులో కూడా నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు.  మరి వారు ఎందుకు రాణించలేకపోయారు. నా వరకు అయితే భారత జట్టులో కూడా స్పిన్నర్లను ఎదుర్కొనే క్రికెటర్లు ఎక్కువగా లేరు. లారా, ద్రవిడ్‌, సచిన్‌, లక్ష్మణ్‌లా స్పిన్‌ను ఎదుర్కొనే ఆటగాళ్లు ప్రస్తుతం ఏ జట్టులోనూ కనిపించడం లేదు" అని స్పోర్ట్స్‌ యారీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
చదవండి: Prithvi Shaw: పృథ్వీ షా 'సెల్ఫీ' వివాదంలో కొత్త ట్విస్ట్..!

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)