Breaking News

Ind Vs Pak: కోహ్లీ మీ భరతం పడతాడన్న అగార్కర్!? పాక్ క్రికెటర్ రియాక్షన్..

Published on Sun, 08/27/2023 - 18:23

India Vs Pakistan- "Bolne se kuch nahi hota": దాయాదులు భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇరుదేశాల అభిమానులతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుందనడంలో సందేహం లేదు ఇలాంటి హై వోల్టేజ్ తాజా మ్యాచ్ కి శ్రీలంక లోని పల్లకెలే వేదిక కానుంది 

గెలుపే లక్ష్యంగా
ఆసియా కప్-2023 లో భాగంగా సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థులు భారత్-పాక్ పోటీ పడనున్నాయి. ఈ వన్డే కప్ టోర్నీలో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న టీమిండియా దాయాదిపై విజయంతో శుభారంభం చేయాలని పట్టుదలగా ఉంది.

ఇక పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి పూనకాలు వస్తాయని తెలిసిందే. గతేడాది ఐసీసీ T20 టోర్నీలో ఈ విషయాన్నీ మరోసారి నిరూపించాడు. పాక్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారి భారత్ కు చారిత్రాత్మక విజయం అందించాడు. 

కోహ్లీ మీ భరతం పడతాడన్న అగార్కర్!?
ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పాక్ బౌలర్లను ఉద్దేశించి.. ఆసియా కప్ లో ..  కోహ్లీ పాకిస్తాన్ పేసర్ల భరతం పడతాడని అన్నట్లు వార్తలు ప్రచారమయ్యాయి. అయితే, ఇవన్నీ వట్టి వదంతులే అని తేలింది.

పాక్ స్టార్ రియాక్షన్ ఇదే!
ఇదే విషయాన్నీ కొంతమంది రిపోర్టర్లు పాకిస్తాన్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ దగ్గర ప్రస్తావించారు. అజిత్ అగార్కర్ ఆ మాటలు  అన్నారా లేదా అన్నది పక్కన పెడితే .. ఇలాంటి కామెంట్లపై మీరేమంటారు అని ప్రశ్నించారు. అఫ్గానిస్తాన్తో మూడో వన్డేలో గెలుపు తర్వాత ప్రెస్ మీట్ సందర్భంగా షాదాబ్ ఈ ప్రశ్నలకు బదులిస్తూ  అందరికి ఆట తోనే సమాధానం ఇస్తామని పేర్కొన్నాడు.

ప్రగల్బాలు
మ్యాచ్ రోజు ఏం జరుగుతుందనే దాని పైనే అంతా ఆధారపడి ఉంటుంది. నేనైనా మా జట్టు లో ఎవరైనా.. లేదంటే ప్రత్యర్థి టీం లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏది మాట్లాడాలంటే అది మాట్లాడవచ్చు. ఎవరిపై ఎలాంటి ప్రభావం పడదు. మ్యాచ్ ముగిసిన తర్వాతే వాస్తవం అందరికి బోధపడుతుంది అని షాదాబ్ ఖాన్ ప్రగల్బాలు పలికాడు.

కాగా లెగ్ స్పిన్నర్ అయిన షాదాబ్ ఖాన్ లోయర్ ఆర్డర్ లో బ్యాటర్గానూ రాణించగలడు. ఇక పాక్ పేస్ దళంలో  ఫాస్ట్ బౌలర్లు షాహీన్ ఆఫ్రిది, నసీం షా గత కొంత కాలంగా మెరుగ్గా రాణిస్తున్న విషయం తెలిసిందే.
చదవండి: Asia Cup 2023: పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. టీమిండియాకు గుడ్‌ న్యూస్‌! అతడు మొదలు పెట్టేశాడు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)