Breaking News

బిహార్ నుంచి మరో క్రికెట్ సంచలనం.. 14 ఏళ్లకే ట్రిపుల్‌ సెంచరీ

Published on Thu, 06/18/2026 - 21:15

వైభవ్ సూర్యవంశీ.. బిహార్ నుంచి వచ్చి తన సంచలన బ్యాటింగ్‌తో యావత్తు క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాడు. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే భారత సీనియర్ జట్టుకు ఎంపికై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇప్పుడు అదే బిహార్ నుంచి మ‌రో యువ సంచ‌ల‌నం వెలుగులోకి వ‌చ్చింది. కేవలం 14 ఏళ్ల వయస్సులోనే తన అద్భుత బ్యాటింగ్‌తో పరుగుల సునామీ సృష్టించింది.

ఈ చిచ్చర పిడుగు పేరు అక్షర గుప్తా. బిహార్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న మహిళల అండర్-19 వన్డే టోర్నమెంట్‌లో అక్షర ఏకంగా అజేయ త్రిశతకం బాది అందరి దృష్టిని ఆకర్షించింది. భాగల్పూర్‌లోని శాండిస్ కాంపౌండ్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్ధి బౌలర్లను అక్షర్ ఉతికారేసింది.  కేవలం 126 బంతుల్లో 42 ఫోర్లు, 16 సిక్సర్ల సాయంతో 306 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.

తొలుత 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అక్షర.. 34 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకుంది. మహిళల దేశీవాళీ క్రికెట్‌లో అత్యధిక స్కోరు చేసిన రెండో బ్యాటర్‌గా అక్షర నిలిచింది. ఈ జాబితాలో అగ్రస్ధానంలో ముంబైకి చెందిన ఇరా గుప్తా (346) ఉంది. మరో 40 పరుగులు చేసి ఉంటే ఇరా గుప్తా రికార్డును అక్షర బ్రేక్ చేసి ఉండేది.

ఎవరీ అక్షర గుప్తా?
వైభవ్ సూర్యవంశీ మాదిరే ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన అక్షర.. పేస్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడడం ఆమె స్పెషాలిటి. కేవలం 14 ఏళ్ల వయసులోనే బీహార్ అండర్-19 జట్టుకు ఆమె నాయకత్వం వహించింది. అంతేకాకుండా బిహార్‌ సీనియర్ జట్టుకు కూడా అక్షర్ ప్రాతినిథ్యం వహించింది. అయితే ఫిట్‌నెస్ పరంగా కూడా ఆమె కొంచెం మెరుగు పడాల్సి ఉంది.
చదవండి: Gurnoor Brar: టీమిండియాకు దొరికిన 'ఆరడుగుల' బుల్లెట్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)