Breaking News

అన్ని ఫార్మాట్లలో ఆడటం కష్టం బుమ్రా.. గుడ్‌బై చెప్పు.. నీకే మంచిది!

Published on Fri, 08/04/2023 - 16:14

'I am a big Bumrah fan but…': Glenn McGrath's game-changing advice: 2018లో బొటనవేలి గాయం.. 2019లో వెన్నునొప్పి.. 2020-21లో కడుపునొప్పి.. 2022లో తీవ్రమైన వెన్నునొప్పి.. గాయం తిరగబెట్టిన కారణంగా దాదాపు ఏడాది పాటు జట్టుకు దూరం.. ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు ఆసియా టీ20 కప్‌-2022, టీ20 వరల్డ్‌కప్‌-2022 వంటి మెగా టోర్నీలకు అందుబాటులో లేకపోవడం వల్ల జట్టుకు భారీ ఎదురుదెబ్బలు...

అవును మీరు ఊహించిన పేరు నిజమే.. టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా గురించే ఈ ఉపోద్ఘాతం.. ఫాస్ట్‌బౌలర్లకు గాయాల బెడద ఎక్కువన్న విషయం తెలిసిందే. అయితే, భారత జట్టు పేస్‌ గుర్రం, బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లో ఏ+ గ్రేడ్‌ కలిగి ఉన్న బుమ్రా విషయంలో మాత్రం తరచూ ఇదే పునరావృతమవుతోంది.

ఐర్లాండ్‌ సిరీస్‌తో కెప్టెన్‌గా రీఎంట్రీ
వెన్నునొప్పి తిరగబెట్టడంతో సర్జరీ చేయించుకుని జాతీయ క్రికెట్‌ అకాడమీలో పునరావాసం పొందిన బుమ్రా.. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ఏకంగా కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ప్రపంచకప్‌-2023కి ముందు ఈ స్టార్‌ పేసర్‌ ఫిట్‌నెస్‌, సన్నద్ధతను అంచనా వేసేందుకు ఈ సిరీస్‌ ఉపయోగపడుతుందని మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది.

నేను అతడికి వీరాభిమానిని.. కానీ
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ బుమ్రాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీమిండియాకు దొరికిన అసాధారణ పేసర్‌ బుమ్రా అనడంలో సందేహం లేదు. అతడి కెరీర్‌లోని బౌలింగ్‌ గణాంకాలే ఈ విషయాన్ని సుస్పష్టం చేస్తున్నాయి.

అతడికి నేను వీరాభిమానిని. కానీ బుమ్రా బౌలింగ్‌ యాక్షన్‌ కారణంగా అతడి శరీరం తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. కాబట్టి తను ఎంత ఫిట్‌గా ఉంటే అంత మంచిది. అలా అయితే, ఇంకొన్నాళ్లు అతడు క్రికెట్‌ కెరీర్‌ను కొనసాగించగలడు’’ అని మెక్‌గ్రాత్‌ అభిప్రాయపడ్డాడు. ఎంఆర్‌ఎఫ్‌ పేస్‌ ఫౌండేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న అతడు ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.

ఏదో ఒక ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పు
ఐపీఎల్‌ కారణంగా ఫాస్ట్‌ బౌలర్లకు ముఖ్యంగా బుమ్రా వంటి స్టార్లకు విశ్రాంతి లేకుండా పోతుందన్న మెక్‌గ్రాత్‌.. అన్ని ఫార్మాట్లలో ఆడే విషయంపై అతడు పునరాలోచించుకోవాలని సూచించాడు. విరామం లేకుండా మూడు ఫార్మాట్లలో ఆడటం కష్టమని.. అందుకే ఈ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకుంటే బుమ్రా తన కెరీర్‌ను మరింత పొడిగించుకునే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చాడు.

చదవండి: IPL 2024: ఆర్సీబీని వీడటం చాలా బాధగా ఉంది.. అందరికీ థాంక్స్‌ 
36 ఏళ్ల ఆధిపత్యానికి తెర.. భారత చెస్‌లో 'నయా' కింగ్‌ ఆవిర్భావం 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి