Breaking News

ఐపీఎల్‌కు ముందు బెంగళూరుకు బిగ్‌ షాక్‌.. రూ.3 కోట్ల ఆటగాడు దూరం!

Published on Mon, 03/06/2023 - 17:25

ఐపీఎల్‌-2023 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇంగ్లండ్‌ యువ ఆల్‌రౌండర్‌ విల్ జాక్స్ గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం. గతేడాది డిసెంబర్‌లో  కొచ్చి వేదికగా జరిగిన ఐపీఎల్‌ మినీ వేలంలో జాక్స్‌ను రూ.3.2 కోట్ల భారీ ధరకు జాక్స్‌ను కొనుగోలు చేసింది.

కాగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా జాక్స్‌ ఎడమకాలికి గాయమైంది. దీంతో అతడు బంగ్లాదేశ్‌ పర్యటనలో మధ్యలోనే స్వదేశానికి పయనమయ్యాడు. అతడు బంగ్లాతో ఆఖరి వన్డేతో పాటుగా టీ20 సిరీస్‌ నుంచి కూడా తప్పుకున్నాడు. 

అతడు ఇంగ్లండ్‌కు చేరుకున్నాక లండన్‌లో పునరావసం పొందనున్నట్లు ఈసీబీ అధికారి ఒకరు పేర్కొన్నారు. అదే విధంగా అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు మూడు నుంచి నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు ఈసీబీ వర్గాలు వెల్లడించాయి.ఈ నేపథ్యంలోనే అతడు మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా విల్‌ జాక్స్‌ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా టీ20ల్లో అయితే దుమ్ము రేపుతున్నాడు. ఇటీవలే ముగిసిన దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు.. తన ఆల్‌రౌండ్‌ స్కిల్స్‌తో అందరిని అకట్టుకున్నాడు. ఒక వేళ విల్‌జాక్స్‌ ఐపీఎల్‌కు అందుబాటులో లేకపోతే ఆర్సీబీ జట్టుకు గట్టి ఎదురుదెబ్బే అని చేప్పుకోవాలి.

మరోవైపు గాయంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా  స్టార్‌ పేసర్‌ జోష్ హాజిల్‌వుడ్ కూడా ఐపీఎల్‌ అందుబాటుపై సందిగ్ధం నెలకొం‍ది. ఒక వేళ హాజిల్‌వుడ్ కూడా ఐపీఎల్‌కు దూరమైతే ఆర్సీబీ ఈ ఏడాది సీజన్‌లో రాణించడం కష్టమే. ఎందుకంటే గతేడాది సీజన్‌లో హాజిల్‌వుడ్  అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.
చదవండి:  Shubman Gill: ఊహించని ట్విస్ట్‌ ఇచ్చిన గిల్‌.. సారా అలీఖాన్‌ కాదు! ఆమే నా క్రష్‌ అంటూ..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)