Breaking News

బంగ్లాతో టీ20 సిరీస్‌.. టీమిండియాకు బిగ్‌ షాక్‌! స్టార్‌ ప్లేయర్‌ దూరం

Published on Sat, 10/05/2024 - 21:24

గ్వాలియర్ వేదికగా ఆదివారం​ బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి టీ20కు టీమిండియా ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే గాయం కారణంగా బంగ్లాతో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. దూబే ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు.

ఈ క్రమంలోనే అతడు బంగ్లాతో వైట్‌బాల్ సిరీస్ నుంచి త‌ప్పుకున్నాడు. ఈ విష‌యాన్ని బీసీసీఐ ధ్రువీక‌రించింది. వెన్ను గాయం కార‌ణంగా దూబే బంగ్లాతో మూడు టీ20ల సిరీస్ నుంచి త‌ప్పుకున్నాడు. అత‌డి స్ధానాన్ని తిల‌క్ వ‌ర్మ‌తో సెలక్షన్ కమిటీ భ‌ర్తీ చేసింది. 

ఆదివారం ఉదయం గ్వాలియర్‌లో తిలక్ జ‌ట్టుతో చేర‌నున్నాడ‌ని బీసీసీఐ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. తిల‌క్ వ‌ర్మ భార‌త్ త‌ర‌పున  ఇప్ప‌టివ‌ర‌కు 16 టీ20లు ఆడి  336 పరుగులు చేశాడు. కాగా ఐపీఎల్-2024 త‌ర్వాత ఈ హైద‌రాబాదీ గాయ ప‌డ్డాడు. దీంతో అత‌డిని  జింబాబ్వే, శ్రీలంకతో టీ20ల‌కు సెల‌క్ట‌ర్లు ఎంపిక చేయ‌లేదు. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించ‌డంతో మ‌రోసారి అత‌డికి భార‌త జ‌ట్టులో చోటు ద‌క్కింది.

భార‌త టీ20 జ‌ట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్‌), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ (వికెట్ కీప‌ర్‌), అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్, తిలక్ వర్మ
చదవండి: IPL 2025: రోహిత్‌, కిష‌న్‌కు నో ఛాన్స్‌.. ముంబై రిటెన్షన్ లిస్ట్ ఇదే!

Videos

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)