Breaking News

T20 WC 2026: ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ

Published on Sat, 01/31/2026 - 13:53

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్టార్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడితో పాటు టాపార్డర్‌ బ్యాటర్‌ మాథ్యూ షార్ట్‌ కూడా అందుబాటులో లేకుండా పోయాడు.

కమిన్స్‌ స్థానంలో అతడే
కమిన్స్‌, షార్ట్‌ గాయాల నుంచి కోలుకోని కారణంగా టోర్నీకి దూరమైనట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా (CA) శనివారం ధ్రువీకరించింది.  ఈ విషయం గురించి సెలక్టర్‌ టోనీ డోడ్‌మేడ్‌ మాట్లాడుతూ.. ‘‘వెన్నునొప్పి నుంచి కోలుకోవడానికి ప్యాట్‌ కమిన్స్‌కు ఇంకాస్త సమయం పడుతుంది. అందుకే టోర్నీలో పాల్గొనడం లేదు.

కమిన్స్‌ స్థానంలో లెఫ్టార్మ్‌ పేసర్‌ బెన్‌ డ్వార్షుయిస్‌ను ఎంపిక చేశాము. ఫీల్డింగ్‌లో రాణించడంతో పాటు లోయర్‌ ఆర్డర్‌లో హిట్టింగ్‌ కూడా చేయగలడు. బంతి బాగా స్వింగ్‌ చేయగల బెన్‌ రాక పేస్‌ దళానికి మరింత వైవిధ్యం తీసుకువస్తుంది’’ అని తెలిపాడు.

మాథ్యూ షార్ట్‌కు బదులు అతడే
అదే విధంగా.. మాథ్యూ షార్ట్‌ స్థానంలో మ్యాట్‌ రెన్షాను వరల్డ్‌కప్‌ జట్టులో చేర్చినట్లు టోనీ ఈ సందర్భంగా వెల్లడించాడు. ‘‘ఆస్ట్రేలియా తరఫున వైట్‌బాల్‌ క్రికెట్‌లో, బిగ్‌బాష్‌ లీగ్‌లో రెన్షా అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. మిడిలార్డర్‌లో అతడు జట్టుకు బలంగా మారుతాడు’’ అని పేర్కొన్నాడు.

కాగా భారత్‌- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్య ఇస్తున్న టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య జరుగనుంది. మిచెల్‌ మార్ష్‌ సారథ్యంలో ఆసీస్‌ ఈ మెగా టోర్నీ బరిలో దిగనుంది.

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి ఆస్ట్రేలియా జట్టు (Updated)
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్, మ్యాట్‌ రెన్షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.

చదవండి: WC 2026: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)