టీమిండియా రీఎంట్రీపై భువనేశ్వర్ కీలక వ్యాఖ్యలు

Published on Sun, 08/02/2026 - 14:11

టీమిండియా వెట‌ర‌న్ ఫాస్ట్ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్‌ను తిరిగి జాతీయ జ‌ట్టులోకి తీసుకోవాల‌నే డిమాండ్‌లు ఎక్కవుగా వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌-2027 దృష్ట్యా భువనేశ్వర్‌ను తిరిగి పిలుపునివ్వాలని సెలక్టర్లను సూచించాడు.

ఈ నేపథ్యంలో తన రీఎంట్రీపై భువీ కీలక ‍వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులోకి తిరిగి రావడమే లక్ష్యంగా తాను ఆడట్లేదని, ఆటపై ఇష్టంతోనే క్రికెట్‌ను  కొనసాగిస్తున్నాని అతడు తెలిపాడు. భువనేశ్వర్ గత నాలుగేళ్లగా భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. 

అయితే ఐపీఎల్‌, యూపీ టీ20 లీగ్స్‌లో మాత్రం క్రమం తప్పకుండా అతడు ఆడుతున్నాడు. ఆర్సీబీ వరుసగా రెండు టైటిల్స్ గెలవడంలో భువీది కీలక పాత్ర. అతడిలో ఏ మాత్రం జోరు తగ్గలేదు. అదే పేస్‌, స్వింగ్‌తో బౌలింగ్ చేస్తున్నాడు. అందుకే అతడు రీఎంట్రీ ఇవ్వాలని మాజీలతో పాటు అభిమానులు కోరుకుంటన్నారు.

"నేను ఐపీఎల్, డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నానంటే దానికి కారణం ఆటపై ఉన్న ఇష్టమే. దేశం తరపున ఆడాలనే నా కలను ఇప్పటికే నెరవేర్చుకున్నాను. మళ్లీ తిరిగి భారత జట్టుకు ఆడేందుకు కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మళ్లీ భారత జట్టుకు ఆడే అవకాశం వస్తే అది చాలా సంతోషం. 

కానీ నేను ఎప్పుడూ ప్రస్తుతం గురించే ఆలోచిస్తాను. నా చేతుల్లో లేని విషయం గురుంచి ఆలోచించను. ఆటపై ఇష్టమున్నంతవరకు కొనసాగుతాను. దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌, యూపీ క్రికెట్ లీగ్స్‌లో వీలైనంతవరకు పూర్తి స్ధాయిలో అందుబాటులో ఉండేందుకు ఇష్టపడతాను. 

మిగిలిన సమయాన్ని నా కుటంబానికి కేటాయిస్తాను" అని ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో భువీ పేర్కొన్నాడు. 36 ఏళ్ల భువనేశ్వర్ చివరిసారిగా 2022లో భారత్ తరపున ఆడాడు. ఇప్పటివరకు అతడు 21 టెస్టులు, 121 వన్డేలు, 87 టీ20ల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)