Breaking News

జింబాబ్వేతో జ‌ర జాగ్ర‌త్త‌

Published on Fri, 02/20/2026 - 02:22

జింబాబ్వే.. రెండేళ్ల కింద‌ట జ‌రిగిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌న‌కు క‌నీసం అర్హ‌త కూడా సాధించ‌లేదు. ఆఫ్రికా క్వాలిఫ‌య‌ర్స్‌లో ఉగండా చేతిలో ఓట‌మి పాలై ఘోర ప‌రాభావ‌న్ని మూట‌క‌ట్టుకుంది. కానీ స‌దరు అఫ్రికా జ‌ట్టు ఎక్క‌డా నిరాశ చెంద‌లేదు. ఎలాగైనా త‌దుప‌రి ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆడాల‌న్న ల‌క్ష్యంతో ఆ జ‌ట్టు ఆట‌గాళ్లు తీవ్రంగా శ్ర‌మించారు. అందుకు త‌గ్గ‌ట్టేగానే టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026కు జింబాబ్వే క్వాలిఫై అయింది.

అయితే ఏ మాత్రం అంచ‌నాలు లేకుండా పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ బరిలోకి దిగిన జింబాబ్వే సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. ఈ మెగా టోర్నీ గ్రూపు స్టేజిలో ఆస్ట్రేలియా, శ్రీలంక వంటి వరల్డ్ క్లాస్ జట్లను చిత్తు చేసి సూపర్‌-8కు అర్హత సాధించింది. సికిందర్ రజా సారథ్యంలోని జింబాబ్వే అద్భుతాలు చేస్తోంది. గ్రూపు-బిలో టేబుల్ టాప‌ర్‌గా సికింద‌ర్ సేన నిలిచింది. ఇప్పటివరకు శ్రీలంక గడ్డపై స‌త్తాచాటిన జింబాబ్వే.. ఇప్పుడు సూప‌ర్‌-8 పోరుకు స‌న్న‌ద్దం కానుంది.

జింబాబ్వేతో జ‌ర జాగ్ర‌త్త‌..
జింబాబ్వే జ‌ట్టు గ్రూపు-1లో భార‌త్‌,  దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ల‌తో పాటు ఉంది. సికింద‌ర్ సేన తొలి సూప‌ర్‌-8 మ్యాచ్‌లో ఫిబ్ర‌వ‌రి 3న వెస్టిండీస్‌తో త‌ల‌ప‌డ‌నుంది. అనంత‌రం ఫిబ్ర‌వ‌రి 6న భార‌త్‌ను జింబాబ్వే ఢీకొట్ట‌నుంది. అయితే జింబాబ్వేను భార‌త్ ఏ మాత్రం త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌కూడద‌ని క్రికెట్ నిపుణులు సూచిస్తున్నారు. 

జింబాబ్వే ప్ర‌స్తుతం బ్యాటింగ్‌, బౌలింగ్ ప‌రంగా ప‌టిష్టంగా ఉంది. ఓపెన‌ర్లు బ్రియాన్ బెన్నెట్, తడివానాషే మరుమాని అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నారు. వీరిద్ద‌రూ ప్ర‌తీ మ్యాచ్‌లోనూ త‌మ జ‌ట్టుకు మంచి ఆరంభాల‌ను అందిస్తున్నారు. బెన్నెట్ ఈ టోర్నీలో ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క‌సారి కూడా ఔట్ కాలేదు. 

ఈ టీ20 ప్రపంచ కప్‌లో జింబాబ్వే చేసిన మొత్తం 457 పరుగులలో బెన్నెట్ దాదాపు 39% సాధించాడు. అదేవిధంగా మిడిలార్డ‌ర్‌లో కెప్టెన్ సికింద‌ర్ ర‌జా కూడా అద‌ర‌గొడుతున్నారు. శ్రీలంకతో జ‌రిగిన చివ‌రి మ్యాచ్‌లో రజా సంచ‌ల‌న ఇన్నింగ్స్ ఆడాడు. ఇక బౌలింగ్‌లో  బ్లెస్సింగ్ ముజరబానీ, బ్రాడ్ ఈవాన్స్  ప్రత్యర్థి బ్యాటర్లను వణికిస్తున్నారు. ముజరబానీ ఇప్పటివరకు 11 వికెట్లు పడగొట్టి టాప్ ఫామ్‌లో ఉన్నాడు. గ్రూపు స్టేజిలో అసాధ‌ర‌ణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన జింబాబ్వే.. ఇప్పుడు సూప‌ర్‌-8లో ఎలా రాణిస్తుందో వేచి చూడాలి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)