ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన.. స్టోక్స్‌ రీఎంట్రీ

Published on Mon, 06/22/2026 - 09:58

న్యూజిలాండ్‌పై తొలి టెస్ట్‌ విజయం తర్వాత ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ రిటైర్మెంట్‌ ప్రకటించనున్నాడని జోరుగా ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారం ఉట్టిదేనని తేలిపోయింది. న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్‌ కోసం ఎంపిక చేసిన ఇంగ్లండ్‌ జట్టులో స్టోక్స్‌కు చోటు దక్కింది. 

స్టోక్స్‌తో పాటుగస్ అట్కిన్సన్‌ కూడా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. జేమ్స్‌ రూ స్థానాన్ని స్టోక్స్‌, సోనీ బేకర్‌ స్థానాన్ని అట్కిన్సన్‌ భర్తీ చేశారు. మిగతా జట్టు యధాతథంగా కొనసాగింది. మూడో టెస్ట్‌ ట్రెంట్‌ బ్రిడ్జ్‌ వేదికగా జూన్‌ 25 నుంచి మొదలుకానుంది.

కాగా, నిన్ననే ముగిసిన రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్‌ 253 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. అంతకుముందు తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ 115 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన విషయం తెలిసిందే.

తిరిగి పగ్గాలు చేపట్టనున్న స్టోక్స్‌
రెండో టెస్ట్‌లో భారీ ఓటమి తర్వాత ఇంగ్లండ్‌ జట్టులో మార్పులు అనివార్యమయ్యాయి. జో రూట్‌ నాయకత్వంలో ఆడిన ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ భారీ తేడాతో ఓడిపోవడం జట్టుపై ఒత్తిడిని పెంచింది. దీంతో అనుభవజ్ఞుడైన స్టోక్స్‌ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు.

స్టోక్స్‌, అట్కిన్సన్‌కు క్లీన్‌ చిట్‌
స్టోక్స్‌, అట్కిన్సన్‌లను రెండో టెస్ట్‌ నుంచి తప్పించడానికి కారణం ఒక వివాదాస్పద సంఘటన. న్యూజిలాండ్‌పై తొలి టెస్ట్‌ విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకునేందుకు స్టోక్స్‌, అట్కిన్సన్‌ లండన్‌లోని చెల్సీ ప్రాంతంలోని రెక్స్‌ రూమ్స్‌ నైట్‌క్లబ్‌కు వెళ్లారు. అక్కడ వీరిద్దరూ ఓ వివాదంలో చిక్కుకున్నారు. 

ఓ రగ్బీ ఆటగాడితో వాగ్వాదం చోటుచేసుకుందని, ఇందులో ఒక ECB సెక్యూరిటీ గార్డ్‌ గాయపడ్డాడని నివేదికలు తెలిపాయి. అలాగే ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు నిర్దేశించిన మిడ్‌నైట్‌ కర్ఫ్యూ నిబంధనను సైతం వీరు ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ECB వెంటనే విచారణ ప్రారంభించి, స్టోక్స్‌ మరియు అట్కిన్సన్‌లను రెండో టెస్ట్‌ నుంచి తప్పించింది.

అయితే తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో స్టోక్స్‌, అట్కిన్సన్‌కు క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్లు తెలిపింది. వీరిద్దరికి ఆ గొడవతో సంబంధం లేదని పేర్కొంది.

 

 

 

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)