Breaking News

అందుకే ఐపీఎల్‌కు దూరంగా ఉన్నాను: స్టోక్స్‌

Published on Thu, 11/28/2024 - 09:53

క్రైస్ట్‌చర్చ్‌: జాతీయ జట్టు తరఫున సాధ్యమైనంత ఎక్కువ కాలం ఆడాలని తాను కోరుకుంటున్నానని... ఈ క్రమంలోనే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) లాంటి ఇతర టోర్నీలకు దూరంగా ఉంటున్నానని ఇంగ్లండ్‌ టెస్టు కెపె్టన్‌ బెన్‌ స్టోక్స్‌ అన్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌ వేలం కోసం తన పేరును నమోదు చేసుకోకుండా స్టోక్స్‌ ముందే తప్పుకున్నాడు. 

గతంలో పుణే, చెన్నై, రాజస్తాన్‌ జట్ల తరఫున ఆడిన స్టోక్స్‌కు లీగ్‌లో మంచి విలువే పలికింది. అయితే ప్రస్తుత స్థితిలో ఇంగ్లండ్‌ జట్టు తరఫున కెరీర్‌ను పొడిగించుకోవడమే తన ప్రథమ ప్రాధాన్యత అని అతను స్పష్టం చేశాడు. ఐపీఎల్‌ తాజా నిబంధన ప్రకారం 2026 వరకు కూడా అతని లీగ్‌లో ఆడే అవకాశం లేదు. ‘నా కెరీర్‌లో ఇప్పుడు చివరి దశకు చేరుకుంటున్నాననేది వాస్తవం. సాధ్యమైనంత ఎక్కువ కాలం ఆడేందుకు నేను ప్రయత్నిస్తా. 

నా ఫిట్‌నెస్‌ను చూసుకోవడం కూడా చాలా కీలకం. ఈ దశలో ఎప్పుడు ఆడాలనే అంశంపై నా ప్రాధాన్యతలు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. కెరీర్‌ పొడిగించుకోవాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి. వేర్వేరు చోట్ల వరుసగా క్రికెట్‌ సాగుతున్న ప్రస్తుత దశలో ఇంగ్లండ్‌ తరఫున ఎక్కువ కాలం ఆడాలనేది నా కోరిక. అందుకే ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నా’ అని స్టోక్స్‌ వెల్లడించాడు. 

సుదీర్ఘ మోకాలి గాయం నుంచి ఇటీవలే కోలుకొని మళ్లీ బరిలోకి దిగిన స్టోక్స్‌కు అక్టోబర్‌ 2026 వరకు ఇంగ్లండ్‌ బోర్డు కాంట్రాక్ట్‌ ఉంది. నేటి నుంచి న్యూజిలాండ్‌తో జరిగే మూడు టెస్టుల సిరీస్‌లో జట్టుకు సారథ్యం వహిస్తున్న స్టోక్స్‌కు వచ్చే ఏడాది స్వదేశంలో భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్, ఆపై యాషెస్‌ సిరీస్‌ కీలకం కానున్నాయి. గత ఏడాది వరల్డ్‌ కప్‌ తర్వాత వన్డేలకు దూరంగా ఉంటున్న స్టోక్స్‌ త్వరలో జరిగే చాంపియన్స్‌ ట్రోఫీలో మళ్లీ వన్డేలు ఆడే అవకాశం ఉంది.     

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)