Breaking News

ఐదు వికెట్లతో చెలరేగిన బ్రాడ్‌.. 172 పరుగులకే ఐర్లాండ్‌ ఆలౌట్‌

Published on Fri, 06/02/2023 - 09:45

లండన్‌: ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌కు ముందు సన్నాహంగా ఐర్లాండ్‌తో ఆడుతున్న ఏకైక టెస్టులో ఇంగ్లండ్‌ తొలిరోజే అన్ని విభాగాల్లో శాసించింది. టాస్‌ నెగ్గిన ఇంగ్లండ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ముందుగా తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఐర్లాండ్‌ 56.2 ఓవర్లలో 172 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్‌ సీమర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ (5/51) నిప్పులు చెరిగాడు.

దీంతో టాపార్డర్‌లో జేమ్స్‌ (36; 5 ఫోర్లు), పీటర్‌ మూర్‌ (10; 2 ఫోర్లు), కెప్టెన్‌ బాల్బిర్నీ (0) సహా... టెక్టర్‌ (0), లోయర్‌ ఆర్డర్‌లో అడెర్‌ (14; 2 ఫోర్లు)లు బ్రాడ్‌ పేస్‌ పదునుకు తలవంచారు. 98 పరుగులకు 5 వికెట్లు కోల్పోగా... ఇందులో 4 వికెట్లు బ్రాడ్‌వే! ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌లో క్యాంఫర్‌ (33; 6 ఫోర్లు), పాల్‌ స్టిర్లింగ్‌ (30; 5 ఫోర్లు) కాసేపు ఇంగ్లండ్‌ బౌలింగ్‌కు ఎదురొడ్డి నిలిచారు.

స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ 2, మాథ్యూ పాట్స్‌ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ ఆట నిలిచే సమయానికి 25 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 152 పరుగులు చేసింది. ఓపెనర్లు క్రాలీ (56; 11 ఫోర్లు), డకెట్‌ (60 బ్యాటింగ్‌; 8 ఫోర్లు) 16.3 ఓవర్లలోనే వేగంగా 109 పరుగులు జోడించారు. క్రాలీని హ్యాండ్‌ అవుట్‌ చేయగా, డకెట్‌తో ఒలీ పోప్‌ (29 బ్యాటింగ్‌; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్‌ ఇంకా 20 పరుగుల దూరంలోనే ఉంది. చేతిలో 9 వికెట్లున్నాయి.
చదవండిJosh Tongue: ఇంగ్లండ్‌కు ఆడతాడని ఎప్పుడో పందెం కాసాడు.. ఇప్పుడు జాక్‌పాట్‌ కొట్టేశాడు

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)