Breaking News

సిరాజ్ మియా అంత దూకుడెందుకు.. ? ఫ్యాన్స్‌ ఫైర్‌

Published on Sat, 12/07/2024 - 07:44

అడిలైడ్ వేదిక‌గా భార‌త్‌తో మొద‌లైన పింక్‌బాల్ టెస్టు తొలి రోజు ఆట‌లో ఆస్ట్రేలియా ఆధిప‌త్యం చెలాయించింది. తొలుత బౌలింగ్‌లో టీమిండియాను 180 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేసిన ఆసీస్‌.. అనంత‌రం బ్యాటింగ్‌లో కూడా అద‌ర‌గొడుతోంది.

మొద‌టి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి వికెట్ న‌ష్టానికి ఆసీస్ జ‌ట్టు 88 ప‌రుగులు చేసింది. ఇక ఇది ఇలా ఉండ‌గా.. తొలి రోజు ఆటలో టీమిండియా స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ అనుచితంగా ప్ర‌వ‌ర్తించాడు. ఆఖరి క్షణంలో తప్పుకున్నాడన్న కోపంతో సహనం కోల్పోయిన సిరాజ్‌.. ఆసీస్ బ్యాట‌ర్ మార్న‌స్ ల‌బుషేన్‌పై బంతిని విసిరాడు.

అస‌లేం జ‌రిగిందంటే?
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 25వ ఓవ‌ర్‌లో 5వ బంతిని వేసేందుకు సిరాజ్ సిద్ద‌మ‌య్యాడు. స్ట్రైక్‌లో మార్న‌స్ ల‌బుషేన్ ఉన్నాడు. అయితే సైట్ స్క్రీన్ వద్ద ప్రేక్షకుడు బీర్‌ స్నేక్‌(ఖాళీ బీర్‌ ప్లాస్టిక్‌ కప్పులు) తీసుకుని నడవడంతో ఏకాగ్రత కోల్పోయిన ల‌బుషేన్ ఆఖ‌రి క్ష‌ణంలో ప‌క్క‌కు త‌ప్పుకున్నాడు.

దీంతో బంతిని వేసేందుకు రనప్‌తో వేగంగా వ‌చ్చిన సిరాజ్ కూడా మ‌ధ్య‌లో ఆగిపోయాడు. అయితే సిరాజ్ త‌న‌ బౌలింగ్‌ను ఆఖరి నిమిషంలో అపిన‌ప్ప‌టికి.. ప్ర‌త్య‌ర్ధి బ్యాట‌ర్‌పై కోపాన్ని మాత్రం కంట్రోల్‌ చేసుకోలేకపోయాడు. స‌హానం కోల్పోయిన సిరాజ్ బంతిని ల‌బుషేన్ వైపు త్రో చేశాడు. ల‌బుషేన్ అలా చూస్తూ ఉండిపోయాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. దీంతో అత‌డిని ఆసీస్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో ట్రోలు చేస్తున్నారు. భార‌త అభిమానులు సైతం అత‌డి చ‌ర్య‌ల‌ను త‌ప్పుబడుతున్నారు. సిరాజ్ మియా అంత దూకుడెందుకు? అంటూ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: చరిత్ర సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ

 

Videos

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

వామ్మో అన్ని కోట్లా? నాగార్జున రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

మెగా DSCలో అక్రమాలను కప్పిపుచ్చలేక అధికారుల తంటాలు

ఆక్వా రైతులకు మరోసారి బిగ్ షాక్

ఈ లాజిక్ ఎలా మిస్సయ్యావ్ లోకేష్ ఇక నీ చాప్టర్ క్లోజ్..

అన్నాచెల్లెళ్ల టీచర్ జాబ్.. బయటపడ్డ నకిలీ సర్టిఫికెట్ల బాగోతం

DSC అక్రమాల పుట్ట గుట్టురట్ట

అతి దారుణంగా కారణం ఇదేన బస్సు స్టాండ్ లో..! పోలీస్ మార్క్ ట్రీట్ మెంట్

Photos

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)