Breaking News

రోహిత్‌, కోహ్లి విషయంలో బీసీసీఐ ఊహించని ప్రకటన!

Published on Mon, 12/08/2025 - 12:48

టీమిండియా సీనియ‌ర్ క్రికెట‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లిలు  విజ‌య్ హ‌జారే ట్రోఫీలో ఆడాల‌ని నిర్ణ‌యించుకున్న సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌ర్ 24 నుంచి ప్రారంభం కానున్న ఈ దేశ‌వాళీ వ‌న్డే టోర్నీలో రెండు లేదా మూడు మ్యాచ్‌ల‌లో కోహ్లి ఆడే అవ‌కాశ‌ముంది. రోహిత్ శ‌ర్మ మాత్రం పూర్తి స్దాయిలో అందుబాటులో ఉంటాన‌ని ముంబై క్రికెట్ అసోయేషిన్‌కు తెలియ‌జేసిన‌ట్లు స‌మాచారం.

అయితే బీసీసీఐ సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఒత్తిడితోనే రో-కో ద్వ‌యం విజ‌య్ హజారే ట్రోఫీలో ఆడేందుకు స‌ముఖ‌త చూపించార‌ని వార్తలు వ‌చ్చాయి. చాలా మంది మాజీలు కూడా వారిద్ద‌రూ అద్బుత‌మైన ఫామ్‌లో ఉన్నార‌ని,  డొమాస్టిక్ క్రికెట్ ఆడాల‌ని ఒత్తిడి తీసుకురావ‌డమేంటి అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ఈ నేప‌థ్యంలో బీసీసీఐ అధికారి ఒక‌రు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు.

"విజయ్ హజారే ట్రోఫీలో ఆడాలన్న‌ది రోహిత్‌, కోహ్లిల వ్య‌క్తిగ‌త నిర్ణ‌యం. అంతే త‌ప్ప క‌చ్చితంగా ఆడాల‌ని వారిని ఎవరూ ఆదేశించలేదు" అని స‌ద‌రు అధికారి స్ప‌ష్టం చేశారు. కాగా రో-కో ప్ర‌స్తుతం సూప‌ర్ ఫామ్‌లో ఉన్నారు. ఇటీవ‌ల సౌతాఫ్రికాతో ముగిసిన వ‌న్డే సిరీస్‌లో దుమ్ములేపారు. 

దీంతో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌-2027లో వారిద్దరూ ఆడ‌డం ఖాయ‌మని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. అయితే ప్ర‌పంచ‌క‌ప్ ప్ర‌ణాళిక‌ల‌లో రోహిత్‌-కోహ్లి ఉన్నారా లేదా అన్న‌ది హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ క్లారిటీ ఇవ్వ‌లేదు. కానీ వారిద్ద‌రూ ప్రపంచ స్థాయి ఆటగాళ్లని, వారి అనుభ‌వం డ్రెస్సింగ్ రూమ్‌లో అవ‌స‌ర‌మ‌ని గంభీర్ చెప్పుకొచ్చాడు.
చదవండి: ENG vs AUS: 'చెత్త బౌలింగ్‌.. చెత్త బ్యాటింగ్‌.. చెత్త కెప్టెన్‌'

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)