Breaking News

దులీప్‌ ట్రోఫీ ఆడండి.. టెస్ట్‌ స్పెషలిస్ట్‌లకు బీసీసీఐ ఆదేశం

Published on Tue, 07/16/2024 - 14:46

సెప్టెంబర్‌లో స్వదేశంలో మొదలయ్యే టెస్ట్‌ సీజన్‌కు ముందు భారత టెస్ట్‌ స్పెషలిస్ట్‌లకు బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. టెస్ట్‌ జట్టు రెగ్యులర్‌ సభ్యులందరూ ఆగస్ట్‌ నెలలో జరిగే దులీప్‌ ట్రోఫీలో పాల్గొనాలని సూచించింది. 

ప్రతి ఆటగాడు కనీసం ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు ఆడేలా ప్లాన్‌ చేసుకోవాలని ఆదేశించింది. ఈ విషయంలో సీనియర్లు రోహిత్‌, విరాట్‌, బుమ్రాలకు మినహాయింపు ఉన్నట్లు తెలుస్తుంది. కీలక ఆటగాళ్లైన ఈ ముగ్గురు గాయాల బారిన పడకుండా ఉండేందుకే మినహాయింపు ఇస్తున్నట్లు సమాచారం.

కాగా, భారత టెస్ట్‌ సీజన్‌ సెప్టెంబర్‌లో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌తో మొదలవుతుంది. అనంతరం భారత్‌.. స్వదేశంలోనే న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడుతుంది. నవంబర్‌ 22-వచ్చే ఏడాది జనవరి 7 మధ్యలో భారత్‌.. ఆస్ట్రేలియా పర్యటనుకు వెళ్తుంది. ఈ పర్యటనలో ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ జరుగనుంది.

ఇదిలా ఉంటే, టీమిండియా టీ20 వరల్డ్‌కప్‌ విజయానంతరం బిజీ షెడ్యూల్‌ కలిగి ఉంది. పొట్టి ప్రపంచకప్‌ ముగిశాక జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడిన భారత్‌.. జులై 27 నుంచి శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్‌ ఆడనుంది. 

అనంతరం సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌ జట్టు భారత్‌లో పర్యటించనుంది. లంకతో టీ20, వన్డే సిరీస్‌ల కోసం భారత జట్టుకు ఇవాళ (జులై 16) ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవల జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్‌ 4-1 తేడాతో గెలుచుకున్న విషయం తెలిసిందే. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)