Breaking News

IPL 2025: బీసీసీఐకి ఊహించని షాక్‌!

Published on Thu, 05/01/2025 - 13:53

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్‌-2025 (IPL 2025) సందర్భంగా బోర్డు తీసుకున్న ఓ నిర్ణయం వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలో బీసీసీఐకి ఢిల్లీ హైకోర్టు నుంచి నోటీసులు వచ్చాయి.

అసలు ఏం జరిగిందంటే.. క్యాష్‌ రిచ్‌ లీగ్‌తో ప్రతి ఏటా ఏదో ఒక కొత్త హంగుతో నిర్వాహకులు అభిమానులను ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. తొలుత అంపైర్‌ క్యామ్‌.. తర్వాత స్పైడర్‌ క్యామ్‌.. తాజాగా రోబో కుక్క (Robotic Dog).. ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టర్ల టీమ్‌లో చేరిపోయాయి.

నడుస్తుంది.. పరిగెడుతుంది.. ఎగురుతుంది..
ఏ‍ప్రిల్‌ 13న ఢిల్లీ క్యాపిటల్స్‌- ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌ సందర్భంగా ఈ రొబోటిక్‌ డాగ్‌ను నిర్వాహకులు పరిచయం చేశారు. ‘‘ఐపీఎల్‌ కుటుంబంలో కొత్త మెంబర్‌. ఇది నడుస్తుంది.. పరిగెడుతుంది.. ఎగురుతుంది.. అంతేకాదు మనస్ఫూర్తిగా నవ్వుతుంది కూడా! మా ప్రచార కుటుంబంలోని కొత్త మెంబర్‌కు స్వాగతం పలకండి’’ అంటూ ఓ వీడియోను షేర్‌ చేశారు.

ఇక రిమోట్‌తో ఆపరేట్‌ చేసే ఈ రోబో కుక్కకు ఏప్రిల్‌ 20న ‘చంపక్‌’గా నామకరణం చేశారు. ముంబై ఇండియన్స్‌- చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ సందర్భంగా ఈ విషయాన్ని నిర్వాహకులు వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో రోబో డాగ్‌కు తాము ఎంచుకున్న పేర్లలో ఎక్కువ మంది చంపక్‌కే ఓటు వేశారని.. అందుకే దానికి ఆ పేరు పెట్టామని వెల్లడించారు.

 

‘చంపక్‌’ పేరిట పిల్లల కోసం మ్యాగజీన్‌
అయితే, ‘చంపక్‌’ విషయంలో ఢిల్లీ ప్రెస్‌ పత్రా ప్రకాశన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 1968 నుంచి తాము ‘చంపక్‌’ పేరిట పిల్లల కోసం మ్యాగజీన్‌ ప్రచురిస్తున్నామని.. అయితే, తమ అనుమతి లేకుండానే తమ ట్రేడ్‌మార్క్‌ వాడుకున్నారని కోర్టుకు విన్నవించింది.  

ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఈ విషయంపై వివరణ ఇవ్వాల్సిందిగా బుధవారం బీసీసీఐకి నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా సమాధానంతో తమ ముందుకు రావాలని బోర్డును ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 9కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

అనుమతి లేకుండా
కాగా తమ ట్రేడ్‌మార్క్‌ను ఉపయోగించుకోకుండా బీసీసీఐకి ఆదేశాలు జారీ చేయాలని కక్షిదారు కోరగా.. న్యాయస్థానం మాత్రం ఈ అంశంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. ఈ విషయం గురించి పబ్లిషర్‌ తరఫు న్యాయవాది అమిత్‌ గుప్తా మాట్లాడుతూ.. రొబోటిక్‌ డాగ్‌కు చంపక్‌ అనే పేరును పెట్టడం ట్రేడ్‌మార్క్‌ వివాదానికి తీసింది. 

అంతేకాదు సుప్రసిద్ధ బ్రాండ్‌ను.. అనుమతి లేకుండా అదీ వాణిజ్యపరంగా వాడుకోవడం నిబంధనలు ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. దశాబ్దాలుగా చంపక్‌కు ఉన్న పేరును ఇలా తమ వినోద వ్యాపారం కోసం వాడుకోవడం ఎంతమాత్రంసరికాదని పేర్కొన్నారు.

ఇక బీసీసీఐ తరఫున న్యాయవాది జై సాయి దీపక్‌ స్పందిస్తూ.. చంపక్‌ అనేది ఒక పువ్వు పేరని.. టీవీ సిరీస్‌లోని క్యారెక్టర్‌గా అభిమానులు చంపక్‌ను చూస్తున్నారని పేర్కొన్నారు. అంతేతప్ప మ్యాగజీన్‌ నుంచి తాము ఎలాంటి పేరును తీసుకోలేదని వెల్లడించారు.

చదవండి: గెలుపు జోష్‌లో ఉన్న శ్రేయస్‌ అయ్యర్‌కు షాక్‌!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)