Breaking News

ఇంగ్లండ్‌ టూర్‌కు ఆర్సీబీ కెప్టెన్‌.. కరుణ్‌, సాయి సుదర్శన్‌కు కూడా పిలుపు..?

Published on Wed, 04/30/2025 - 12:12

ఐపీఎల్‌ 2025 ముగిశాక భారత క్రికెట్‌ జట్టు జూన్‌ మధ్యలో ఇంగ్లండ్‌ పర్యటనకు బయల్దేరుతుంది. ఈ పర్యటనలో టీమిండియా 5 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ సిరీస్‌ కోసం బీసీసీఐ 35 మంది ఆటగాళ్లను షార్ట్‌ లిస్ట్‌ చేసినట్లు తెలుస్తుంది.

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2024-25, అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో ఘోరంగా విఫలమైన భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు సెలెక్టర్లు మరో అవకాశం ఇస్తారని తెలుస్తుంది. ఇన్‌ ఫామ్‌ బ్యాటర్‌ ‍కరుణ్‌ నాయర్‌, ఆర్సీబీ కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ జట్టులో చోటు దక్కించుకోనున్నారని సమాచారం. 

ఐపీఎల్‌ 2025లో లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా కొనసాగుతున్న గుజరాత్‌ ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ను ప్రత్యామ్నాయ ఓపెనర్‌గా ఎంపిక చేయనున్నారని తెలుస్తుంది. ప్రత్యామ్నాయ ఓపెనర్‌గా సీఎస్‌కే యువ సంచలనం ఆయుశ్‌ మాత్రే పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.

అశ్విన్‌ రిటైర్‌ కావడంతో అతని​ స్థానాన్ని కుల్దీప్‌ యాదవ్‌తో భర్తీ చేయనున్నారని సమాచారం. ఈ సిరీస్‌ కోసం అక్షర్‌ పటేల్‌ పేరు పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తుంది. అలాగే మిడిలార్డర్‌ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ పేరును కూడా సెలెక్టర్లు పక్కన పెట్టారని తెలుస్తుంది. 

పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో సత్తా చాటుతున్న శ్రేయస్‌ అయ్యర్‌ను ఎంపిక చేయాలా వద్దా అన్న అంశంపై చర్చలు సాగుతున్నట్లు సమాచారం​. ప్రధాన పేసర్లుగా బుమ్రా, షమీ ఎంపిక దాదాపుగా ఖరారైనప్పటికీ.. సేఫ్టీగా వీలైనంత ఎక్కువ మంది రిజర్వ్‌ పేసర్లను ఎంపిక చేయనున్నారని తెలుస్తుంది. ఇంగ్లండ్‌ పర్యటన కోసం భారత సీనియర్‌ జట్టుతో పాటు భారత-ఏ జట్టును ‍కూడా మే రెండో వారంలో ప్రకటించే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే, భారత ఆటగాళ్లంతా ప్రస్తుతం ఐపీఎల్‌ 2025లో బిజీగా ఉన్నారు. ఈ లీగ్‌లో ప్రదర్శనల ఆధారంగా ఇంగ్లండ్‌ పర్యటనకు ఎంపికలు జరుగుతాయి. ఈ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే ఆటగాళ్లను భారత సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోవచ్చు. ఫార్మాట్‌ వేరైనా ఆటగాళ్లలో కన్సిస్టెన్సీని గమనిస్తారు.

ప్రస్తుతం ఐపీఎల్‌ 2025 రసవత్తరంగా సాగుతుంది. మొత్తం ఏడు జట్లు నాలుగు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ల కోసం ప్రధానంగా పోటీపడుతున్నాయి. ఏ జట్టుకు ఇప్పటివరకు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు కాలేదు. సీఎస్‌కే మినహా అన్ని జట్లకు ప్లే ఆఫ్స్‌ అవకాశాలు ఉన్నాయి. 

ప్లే ఆఫ్స్‌ రేసులో ఆర్సీబీ ముందుంది. ఆ జట్టు 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఆతర్వాత ముంబై, గుజరాత్‌, ఢిల్లీ తలో 12 పాయింట్లతో వరుసగా 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి. పంజాబ్‌ (11), లక్నో (10), కేకేఆర్‌ (9) ఆతర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. రాజస్థాన్‌ (6), సన్‌రైజర్స్‌ (6), సీఎస్‌కే (4) 8, 9, 10 స్థానాల్లో ఉన్నాయి.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)