Breaking News

Jay Shah: 32 ఏళ్ల వయసులో తొలిసారి.. ముచ్చటగా మూడోసారి

Published on Wed, 01/31/2024 - 21:27

బీసీసీఐ కార్యదర్శి జై షా మరోసారి ఆసియా క్రికెట్‌ మండలి(ఏసీసీ) అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇండోనేషియాలోని బాలిలో ఏసీసీ బుధవారం వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించింది. ఇందులో భాగంగా జై షాను తమ చీఫ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

32 ఏళ్ల వయసులో తొలిసారి..
కాగా జై షా ఏసీసీ బాస్‌గా ఎన్నికకావడం ఇది వరుసగా మూడోసారి. నజ్ముల్‌ హుసేన్‌ స్థానంలో 2021లో తొలిసారిగా అధ్యక్ష పదవిని చేపట్టిన ఆయన.. ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా నిలిచారు. అప్పటికి జై షాకు 32 ఏళ్లు.

ఇక తాజా సమావేశంలో సభ్యుల నిర్ణయానికి అనుగుణంగా జై షా పదవీ కాలం కొనసాగనుంది. కాగా బీసీసీఐలో కీలక వ్యక్తిగా ఉన్న ఆయన.. ఏసీసీలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. కోవిడ్‌ సమయంలో బాస్‌గా బాధ్యతలు స్వీకరించి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.

ప్రతీ విషయంలోనూ తనదైన ముద్ర
ఇక గతేడాది ఆసియా కప్‌-2023 హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించడంలో జై షా కీలక పాత్ర పోషించారు. ఈవెంట్‌ నిర్వహణ హక్కులు దక్కించుకున్న పాకిస్తాన్‌కు టీమిండియాను పంపే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు.

పాక్‌ పంతం వీడకపోతే.. ప్రత్యామ్నాయాలు వెదుక్కోవాల్సి ఉంటుందని హెచ్చరించి శ్రీలంక- పాక్‌ వేదికగా టోర్నీని నిర్వహించేలా జై షా ఏర్పాట్లు చేశారు. టీమిండియా ఆడే మ్యాచ్‌లన్నింటికీ లంక ఆతిథ్యం ఇచ్చింది. ఇక ఈ దఫా వన్డే ఫార్మాట్లో నిర్వహించిన ఆసియా కప్‌ ఈవెంట్‌ ఫైనల్లో టీమిండియా శ్రీలంకను ఓడించి విజేతగా అవతరించింది. కాగా భారత హోం మంత్రి అమిత్‌ షా కుమారుడే జై షా అన్న విషయం తెలిసిందే.

చదవండి: Ind vs Eng 2nd Test: ఇంగ్లండ్‌కు షాక్‌.. కీలక స్పిన్నర్‌ దూరం

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)