Breaking News

ఐపీఎల్‌ రిటెన్షన్‌ రూల్స్‌ ఇవే.. ఆర్టీఎమ్‌ కార్డుకు నో ఛాన్స్‌..!

Published on Thu, 09/26/2024 - 16:14

ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఒక్కో ఫ్రాంఛైజీ గరిష్టంగా  ఐదుగురు ఆటగాళ్లను (ముగ్గురు దేశీయ, ఇద్దరు విదేశీ ఆటగాళ్లు) రిటైన్‌ చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. రైట్‌ టు మ్యాచ్‌ (ఆర్టీఎమ్‌) కార్డుకు  బీసీసీఐ ఒప్పుకోలేదని తెలుస్తోంది. బుధవారం బెంగళూరులో జరిగిన బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో ఈ అంశాలన్ని ఫైనలైజ్‌ అయినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి.

రైట్ టు మ్యాచ్ కార్డ్(ఆర్టీఎమ్‌) అంటే.. ఏదైనా ఫ్రాంచైజీ వేలంలో  తమ ఆటగాడిని కొనుగోలు చేస్తే ఆర్టీఎమ్‌ కార్డు ద్వారా ఆ ధరను సదరు ప్రాంచైజీకి చెల్లించి ఆటగాడిని తిరిగి తీసుకోవచ్చు. 2018 ఐపీఎల్ మెగా వేలంలో ఆర్టీఎమ్ కార్డ్‌ను చివరిసారిగా ఉపయోగించారు. ఆ తర్వాత బీసీసీఐ ఆర్టీఎమ్‌ కార్డ్‌ రూల్‌ను తొలగించింది. రానున్న మెగా వేలం తిరిగి ఈ రూల్‌ను ప్రవేశపెట్టాలని ఫ్రాంచైజీలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

అయితే బీసీసీఐ ఇందుకు ససేమిరా అన్నట్లు తెలుస్తుంది. ఫ్రాంచైజీలు రిటైన్‌ చేసుకునే ఆటగాళ్ల సంఖ్యను పెంచాలని డిమాండ్‌ చేయగా.. దీనికి కూడా బీసీసీఐ నో చెప్పినట్లు సమాచారం. అంతిమంగా ఐదు రిటెన్షన్స్‌, నో ఆర్టీఎమ్‌, మెగా వేలానికి బీసీసీఐ ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఈ ఏడాది డిసెంబర్‌లో ఐపీఎల్‌ 2025 సీజన్‌కు సంబంధించిన మెగా వేలం జరిగే అవకాశం ఉంది.

చదవండి: న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌.. రెండేళ్ల కరువును తీర్చుకున్న చండీమల్‌
 

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)