Breaking News

అజిత్ అగార్కర్ భవితవ్యంపై బీసీసీఐ సంచలన నిర్ణయం

Published on Sun, 04/19/2026 - 13:15

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI).. సీనియ‌ర్ మెన్స్ సెలక్ష‌న్ క‌మిటీ చైర్మెన్‌గా అజిత్ అగార్క‌ర్ పదవీకాలాన్ని పొడిగించేందుకు సిద్ద‌మైంది. కొత్త కాంట్రాక్ట్ ప్ర‌కారం అగార్క‌ర్ త‌న ప‌దవిలో వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2027 వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాడు. వాస్త‌వానికి అగార్క‌ర్ కాంట్రాక్ట్ ఈ ఏడాది చివ‌ర్ల‌లో ముగియాల్సి ఉంది.

కానీ వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న వ‌ర‌ల్డ్‌కప్ దృష్టిలో పెట్టుకుని చీఫ్ సెలక్టర్‌గా అగార్కర్‌నే కొనసాగించాలని బోర్డు నిర్ణయించింది. అగార్కర్ హయాంలో టీమిండియా అద్భుత విజయాలు సాధించింది. ఈ ముంబైకర్ బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా 2023 జూలైలో బాధ్యతలు చేపట్టగా.. అప్పటి నుంచి భారత జట్టు  వైట్-బాల్ క్రికెట్‌లో తిరుగులేని శక్తిగా ఎదిగింది.

అతడి నేతృత్వంలో భారత్ మూడు ప్రధాన ఐసీసీ టోర్నీలను కైవసం చేసుకుంది. వరుసగా రెండు టీ20 ప్రపంచకప్‌(2024, 2026)లతో పాటు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా సొంతం చేసుకుంది. ఈ కారణాలతో అతడి కాంట్రాక్ట్‌ను బీసీసీఐ పొడిగించనుంది.  ఈ విషయాన్ని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించారు.

"అగార్కర్ హయంలో భారత జట్టు చారిత్రత్మక విజయాలను అందుకుంది. అతడి నేతృత్వంలో సెలక్షన్ కమిటీ కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది. జట్టులో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అతడి పని తీరు పట్ల బోర్డు సంతృప్తిగా ఉంది. అగార్కర్‌నే చైర్మెన్ కొనసాగించాలని బోర్డు భావిస్తోంది. ఐపీఎల్‌-2026 సందర్భంగా బీసీసీఐ కార్యవర్గ సభ్యులు సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటారు" అని సదరు అధికారి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో పేర్కొన్నారు.
చదవండి: ఆ మూడు ఓవర్లే కొంపముంచాయి: రుతురాజ్‌
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)