Breaking News

రిషబ్ పంత్ గాయం ఎఫెక్ట్‌.. సరికొత్త రూల్‌ను తీసుకురానున్న బీసీసీఐ!

Published on Sat, 08/16/2025 - 18:09

భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) దేశవాళీ క్రికెట్ సీజ‌న్ 2025-26లో 'సీరియస్ ఇంజురీ రీప్లేస్‌మెంట్‌'స‌రికొత్త రూల్‌ను ప‌రిచ‌యం చేయ‌నుంది. ఈ రూల్ ప్రకారం ఏ ప్లేయ‌రైనా తీవ్రంగా గాయ‌ప‌డితే అత‌డి స్ధానంలో 'లైక్ ఫర్ లైక్ రీప్లేస్‌మెంట్’ మరొక‌రిని తీసుకోవ‌చ్చు.

అంటే ఉద‌హ‌ర‌ణ‌కు బౌల‌ర్ గాయ‌ప‌డితే బౌల‌ర్‌, బ్యాట‌ర్ గాయ‌ప‌డితే బ్యాటర్‌ను భ‌ర్తీ చెయోచ్చు. టాస్ వేసే ముందు ఆయా జ‌ట్లు న‌లుగురు ఆటగాళ్ల‌తో కూడిన జాబితాను అంపైర్‌ల‌కు అందజేయాలి. ఎవ‌రైనా గాయ‌ప‌డితే వారి నుంచే భ‌ర్తీ చేయాలి. ప్ర‌స్తుతానికి ఈ రూల్ సీకే నాయుడు ట్రోఫీలో వ‌ర్తించ‌నుంది.

అహ్మదాబాద్‌లో జరుగుతున్న సెమినార్‌లో అంపైర్లకు ఈ మార్పు గురించి తెలియజేసేందుకు బీసీసీఐ ఒక ప్ర‌త్యేక సెషన్‌ను నిర్వహించింది. అయితే ఈ ఏడాది జ‌ర‌గ‌నున్న సయ్యద్ ముష్తాక్ అలీ లేదా విజయ్ హజారే ట్రోఫీలో బోర్డు ఈ ప్ర‌వేశ పెట్ట‌క‌పోవ‌చ్చు.

ఐపీఎల్‌-2026,  రంజీ ట్రోఫీ సీజ‌న్‌లో ఈ కొత్త నియ‌మాన్ని అమలు చేసే అవ‌కాశ‌ముంది. అయితే గాయం తీవ్రతను బట్టి వైద్యుడిని సంప్రదించిన తర్వాత ఆట‌గాడిని రిప్లేస్ చేయాలా వ‌ద్దా  అని నిర్ణయించే తుది అధికారం మ్యాచ్ రిఫరీదేనని బోర్డు అధికారి ఒక‌రు స్పష్టం చేశారు. 

కాగా ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డ్డ రిష‌బ్ పంత్‌ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఈ కొత్త రూల్‌కు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ సిరీస్‌లో పంత్ కాలు ఎముక విరిగిన కూడా బ్యాట్‌కు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కేవలం కంకషన్ సబ్‌స్ట్యూట్‌(తలకు దెబ్బ)కు మాత్రమే రిప్లేస్‌మెంట్ అవకాశముంది.
చదవండి: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం.. ఆటగాళ్లకు జీతాలు కట్‌!?


 

#

Tags : 1

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు