Breaking News

డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఫ్యామిలీకి ‘నో ఎంట్రీ’

Published on Wed, 03/05/2025 - 03:11

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) సందర్భంగా పాటించాల్సిన నిబంధనల అంశంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కఠినంగా వ్యవహరించాలని భావిస్తోంది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌ చేతిలో భారత జట్టు టెస్టు సిరీస్‌ ‘వైట్‌వాష్’ కావడంతో పాటు... ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించలేకపోవడంతో నిబంధనలను పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించే సమయంలో కూడా భారత ఆటగాళ్లు టీమ్‌ బస్సుల్లోనే ప్రయాణించాలని వెల్లడించింది.  

» ఆటగాళ్లు తప్పకుండా జట్టు సభ్యులతో కలిసి ‘టీమ్‌ బస్‌’లోనే ప్రయాణించేలా చూడాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు ఫ్రాంచైజీ యాజమాన్యాలకు సూచించింది. 
» ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కుటుంబ సభ్యులను డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి అనుమతించకూడదని బీసీసీఐ నిర్ణయించింది. ప్రాక్టీస్‌ రోజుల్లోనూ దీన్ని కొనసాగించాలని సూచించింది. అనుమతించిన సిబ్బంది మినహా డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి మరెవరికీ ప్రవేశం కల్పించకూడదని ప్రకటించింది. 
» ప్లేయర్ల స్నేహితులు, సన్నిహితులు ఇతర వాహనాల్లో ప్రయాణిస్తూ... హాస్పిటాలిటీ ప్రాంతం నుంచి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ చూడొచ్చు. నెట్‌ బౌలర్లు, త్రోడౌన్‌ స్పెషలిస్ట్‌లు కూడా బీసీసీఐ నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. 
» ఐపీఎల్‌ సందర్భంగా ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని పేర్కొన్న బీసీసీఐ... ‘ఆరెంజ్‌ క్యాప్‌’, ‘పర్పుల్‌ క్యాప్‌’ సాధించిన ఆటగాళ్లు మ్యాచ్‌ ఆరంభంలో కనీసం రెండు ఓవర్ల పాటైనా వాటిని ధరించాలని 
సూచించింది. మ్యాచ్‌ అనంతరం బహుమతి ప్రదానోత్సవంలో ప్లేయర్లు స్లీవ్‌లెస్‌ జెర్సీలను ధరించకూడదని బీసీసీఐ వెల్లడించింది. 
» మార్చి 22 నుంచి కోల్‌కతాలో ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభం కానుండగా... దానికి ముందు ఈ నెల 20న ముంబై వేదికగా కెపె్టన్‌ల సమావేశం జరగనుంది. సాధారణంగా తొలి మ్యాచ్‌ జరిగే వేదికలోనే ఈ భేటీ జరుగుతుంది. కానీ ఈసారి అందుకు భిన్నంగా ముంబైలో నిర్వహించనున్నారు.  

#

Tags : 1

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌