Breaking News

ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌.. భారత స్టార్‌ పేసర్‌ ఔట్‌?

Published on Fri, 05/23/2025 - 13:03

ఇంగ్లండ్‌, భారత్‌ మధ్య జరిగే ఐదు టెస్టుల (ENG vs IND) సిరీస్‌కు ముందే టీమిండియాకు బిగ్‌ షాక్‌ తగిలింది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు భారత్‌ స్టార్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ (Mohammed Shami) దూరమయ్యే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. టెస్టు మ్యాచ్‌లో షమీ సుదీర్ఘ స్పెల్స్‌ వేయలేడని బీసీసీఐ (BCCI) వైద్యబృందం చెప్పినట్లు తెలుస్తోంది.

బీసీసీఐ అధికారి ఒకరు.. షమీ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ తరఫున నాలుగు ఓవర్లు వేశాడు. షమీ ఒక రోజులో పది ఓవర్ల కంటే ఎక్కువ ఓవర్లు వేస్తాడా.. అన్న విషయం బోర్డుకు, సెలెక్టర్లకు తెలియదు. ఇంగ్లండ్‌లో టెస్టుల్లో పేసర్లు ఎక్కువ స్పెల్స్‌ వేసే అవసరం ఉండొచ్చు. అక్కడి పిచ్‌లు ఫాస్ట్‌ బౌలర్లకు అనుకూలంగా ఉంటాయి. ఎక్కువగా పేసర్లే వికెట్లు తీస్తారు. అందుకే మేం ఎలాంటి ఛాన్స్‌లు తీసుకోలేం అని నేషనల్‌ మీడియాకు చెప్పుకొచ్చారు.

మరోవైపు.. ఇంగ్లండ్‌ సిరీస్‌కు మరో 20 రోజులే సమయంలో షమీపై (BCCI) వైద్యబృందం కూడా ఓ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. షమీ టెస్టుల్లో సుదీర్ఘ స్పెల్స్‌ వేయలేడని బీసీసీఐ వైద్యబృందం యాజమాన్యానికి చెప్పినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతడిని జట్టులోకి తీసుకుంటే.. ఐదు టెస్టులూ ఆడే అవకాశాలు చాలా తక్కువని ఆ కథనాల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ షమీని టెస్టు సీరిస్‌కు ఎంపిక చేయకపోతే అతడి స్థానంలో అర్ష్‌దీప్‌ సింగ్‌కు అవకాశం లభించవచ్చు. షమీ టెస్టుల్లో చివరిసారిగా ఓవల్‌లో ఆస్ట్రేలియాపై 2023 WTC Finalలో ఆడిన సంగతి తెలిసిందే.

ఇదిలాఉండగా.. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ కోసం బీసీసీఐ.. భారత జట్టును శనివారం ప్రకటించనుంది. రోహిత్‌ శర్మ టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన నేపథ్యంలో.. ఎవరికి సారథ్య బాధ్యతలు అప్పగిస్తారన్న విషయం ఆసక్తికరంగా మారింది. రోహిత్‌, విరాట్‌ కోహ్లీ రిటైర్మెంట్‌ తర్వాత తొలిసారి భారత జట్టు ఎంపిక ఉండనుంది అనే చర్చ నడుస్తోంది. ఇక టెస్టు కెప్టెన్సీ రేసులో శుభ్‌మన్‌ గిల్, జస్‌ప్రీత్‌ బుమ్రా పోటీలో ఉన్నారు. కోహ్లీ, రోహిత్‌.. స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారని అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)