Breaking News

'అవ‌న్నీ రూమ‌ర్సే.. ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు': బీసీసీఐ

Published on Mon, 05/19/2025 - 17:10

భారత్‌-పాక్ మధ్య ఉద్రిక్తల కారణంగా ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ నిర్వహించే అన్ని క్రికెట్ టోర్నీల‌కు దూరంగా ఉండాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వ‌చ్చిన సంగతి తెలిసిందే.  పాకిస్తాన్‌కు చెందిన మంత్రి మొహిసిన్‌ నఖ్వీ ఏసీసీ చైర్మెన్‌గా ఉండ‌డంతో భారత క్రికెట్ బోర్డు ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు జాతీయ మీడియాలో క‌థనాలు వెలువ‌డ్డాయి.

తాజాగా ఈ విష‌యంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. ఆసియా కప్, మహిళల ఎమర్జింగ్ జట్ల ఆసియా కప్ నుండి వైదొలుగుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయ‌న ఖండించారు.

"ఆసియా కప్, మహిళల ఎమర్జింగ్ జట్ల ఆసియా కప్ రెండు ఏసీసీ ఈవెంట్‌ల‌లోనూ పాల్గొనకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకుంద‌న్న వార్త‌లు మా దృష్టికి వచ్చాయి. ఈ రోజు ఉద‌యం నుంచి ఇదే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇవ‌న్నీ నిరాధ‌ర‌మైన వార్త‌లు. బీసీసీఐ ఇప్ప‌టివ‌ర‌కు త‌దుప‌రి ఏసీసీ ఈవెంట్‌ల‌కు సంబంధించి ఎలాంటి చ‌ర్చలు జ‌ర‌ప‌లేదు. అదేవిధంగా ఏసీసీకి ఎటువంటి లేఖ కూడా బీసీసీఐ రాయ‌లేదు.

ప్ర‌స్తుతం మా దృష్టింతా ఐపీఎల్‌, తదుపరి ఇంగ్లండ్ సిరీస్‌లపైనే మాత్రమే ఉంది. ఆసియా కప్ లేదా ఏదైనా ఇతర ఏసీసీ ఈవెంట్‌పైన ఎటువంటి నిర్ణయం తీసుకున్న భారత క్రికెట్ బోర్డు ప్రెస్‌నోట్ కచ్చితంగా విడుదల చేస్తోంది" అని దేవజిత్ సైకియా టైమ్స్ ఆఫ్ ఇం‍డియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవజిత్ సైకియా పేర్కొన్నారు. 

కాగా మహిళల ఎమ‌ర్జింగ్ టీమ్స్ ఆసియా క‌ప్ వచ్చే నెలలో జరగనుంది. ఆ తర్వాత సెప్టెంబ‌ర్‌లో పురుషుల ఆసియా క‌ప్ టోర్నీని నిర్వహించనున్నారు. గత ఆసియాకప్‌ టోర్నీ శ్రీలంక, పాక్‌ల వేదికగా హైబ్రిడ్‌ మోడల్‌లో జరిగింది.
చదవండి: IPL 2025: పాకిస్తాన్‌ సరసన గుజరాత్‌ టైటాన్స్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)