Breaking News

వయో నిర్ధారణకు మరో పరీక్ష

Published on Tue, 06/17/2025 - 09:09

న్యూఢిల్లీ: క్రీడల్లో తరచూ తప్పుడు వయో ధ్రువీకరణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా పలు వయో విభాగాల ఈవెంట్లలో పెను విమర్శలు తావిస్తోంది. దీనిపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కఠినంగా వ్యవహరిస్తోంది. అండర్‌–15, అండర్‌–16, అండర్‌–19 క్రికెట్‌ ఆడే టీనేజర్ల అసలైన వయసు ధ్రువీకరణ కోసం పరీక్షలు చేయిస్తోంది. 

ఇప్పుడు కచ్చితమైన వయో నిర్ధారణకు అదనంగా మరో బోన్‌ మ్యారో (ఎముక వయసు పరీక్ష) టెస్టు చేస్తామని బోర్డు ప్రకటించింది. దీనివల్ల అర్హత గల క్రికెటర్లకు నష్టం వాటిల్లకుండా, అనర్హులను దూరం పెట్టేలా అదనపు పరీక్ష ఉపయోగపడుతుందని బోర్డు భావిస్తోంది. క్రితంసారి అండర్‌–16లో పాల్గొన్న క్రికెటర్‌ మరో ఏడాది ఆ వయో విభాగంలో పాల్గొనాలంటే ఈ పరీక్షకు హాజరై నెగ్గాల్సి ఉంటుంది.

 ఒకవేళ క్రితం ఏడాదే ఎముక పరీక్షలో ఓ సంవత్సరం పిన్న అని తేలితే మాత్రం మరుసటి ఏడాది ఆ పరీక్షను చేయరు. ఉదాహరణకు అండర్‌–16 బాలుర క్రికెట్‌లో కటాఫ్‌ వయసు 16.5 ఏళ్లు. అంటే పరీక్ష సమయంలో ఎముక వయసు 16.4 ఏళ్లు మాత్రమే ఉండాలి. లేదంటే ఆ సీజన్‌లో అనుమతించరు. అండర్‌–15 బాలికల క్రికెట్‌లో కటాఫ్‌ వయసు 15 ఏళ్లు. అయితే ఎముక పరీక్ష సమయంలో 14.9 ఏళ్లే ఉండాలి. గత సీజన్‌లో ఆ బాలిక బోన్‌ మ్యారో టెస్టులో వయసు 13.9 అని నిర్ధారణ అయితే మరుసటి సీజన్‌లో టెస్టు పెట్టకుండానే అనుమతిస్తారు.    

Videos

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు