Breaking News

సుడిగాలి శతకం.. అయినా వరించని అదృష్టం

Published on Tue, 02/10/2026 - 15:53

బీసీసీఐ తాజాగా ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్‌ల్లో (2025-26) ముగ్గురి పేర్లు కనిపించకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ ముగ్గురు ఎవరంటే.. ఇషాన్‌ కిషన్‌, మొహమ్మద్‌ షమీ, సర్ఫరాజ్‌ ఖాన్‌. ఈ ముగ్గురు గత కొంతకాలంగా ఫార్మాట్లకతీతంగా రాణిస్తున్నా, బీసీసీఐ కాంట్రాక్ట్‌లు దక్కలేదు. షమీ, సర్ఫరాజ్‌ను పక్కన పెడితే ఇషాన్‌ కిషన్‌కు కాంట్రాక్ట్‌ లభించకపోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఎందుకంటే, ఇతగాడు ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తిరువనంతపురం వేదికగా జరిగిన ఐదో టీ20 సుడిగాలి శతకం (43 బంతుల్లో) బాదాడు. అయినా అతనికి బీసీసీ​ఐ కాంట్రాక్ట్‌ దక్కలేదు. ఇషాన్‌కు కాంట్రాక్ట్‌ దక్కకపోవడానికి బీసీసీఐ ప్రత్యేకమైన కారణాలు ఏమీ చెప్పనప్పటికీ.. నిబంధనలు ఓ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

అదేటంటే.. ఏ ఆటగాడికైనా బీసీసీఐ కాంట్రాక్ట్ లభించాలంటే సమీక్షా కాలం (అక్టోబర్ 2024–సెప్టెంబర్ 2025)లో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాలి. ఇషాన్‌ ఈ మధ్యకాలంలో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ కూడా ఆడకపోవడంతో అతనికి బీసీసీఐ కాంట్రాక్ట్‌ లభించలేదు. కాంట్రాక్ట్‌ లభించడానికి ఫామ్‌ కొలమానం కాదు. ఈ కారణంగానే ఇషాన్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నా కాంట్రాక్ట్‌ లభించలేదు.

షమీ, సర్ఫరాజ్‌ పరిస్థితి కూడా ఇదే. వీరిద్దరు కూడా సమీక్షా కాలం (అక్టోబర్ 2024–సెప్టెంబర్ 2025)లో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ కూడా ఆడలేదు. దేశవాలీ క్రికెట్‌లో ఈ ముగ్గురు ఫార్మాట్లకతీతంగా సత్తా చాటినా, బీసీసీఐ కాంట్రాక్ట్‌ దక్కలేదు. వీరిలో ఇషాన్‌, సర్ఫరాజ్‌కు వచ్చే ఏడాదైనా కాంట్రాక్ట్‌ లభించవచ్చేమో కాని, షమీని మాత్రం ఇక మరిచిపోవాల్సిందేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

2025-26 సంవత్సరానికి బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లు లభించిన ఆటగాళ్లు..
గ్రేడ్‌ ‘ఎ’ – శుబ్‌మన్‌ గిల్, జస్‌ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా  
గ్రేడ్‌ ‘బి’ – రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, వాషింగ్టన్‌ సుందర్, కేఎల్‌ రాహుల్, సిరాజ్, హార్దిక్‌ పాండ్యా, రిషభ్‌ పంత్, కుల్దీప్‌ యాదవ్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్‌ యాదవ్, శ్రేయస్‌ అయ్యర్‌.  
గ్రేడ్‌ ‘సి’ – అక్షర్‌ పటేల్, తిలక్‌ వర్మ, రింకూ సింగ్, శివమ్‌ దూబే, సంజు సామ్సన్, అర్షదీప్‌ సింగ్, ప్రసిధ్‌ కృష్ణ, ఆకాశ్‌దీప్, ధ్రువ్‌ జురేల్, హర్షిత్‌ రాణా, వరుణ్‌ చక్రవర్తి, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అభిషేక్‌ శర్మ, సాయిసుదర్శన్, రవి బిష్ణోయ్, రుతురాజ్‌ గైక్వాడ్‌.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)