Breaking News

ఐపీఎల్ నుంచి ఔట్‌.. హ్యారీ బ్రూక్‌కు బీసీసీఐ షాక్‌..!

Published on Thu, 03/13/2025 - 20:51

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ ఐపీఎల్‌-2025(IPL 2025) నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. గత డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రూ.6.25 కోట్ల భారీ ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. అయితే రాబోయే సిరీస్‌లను దృష్టిలో పెట్టుకుని.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు బ్రూక్ తెలిపాడు. 

కాగా ఈ ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ ఐపీఎల్ నుంచి వైదొల‌గ‌డం ఇది వ‌రుస‌గా రెండో సారి. కాగా బీసీసీఐ కొత్త రూల్స్ ప్ర‌కారం ..వేలంలో అమ్ముడుపోయిన ఆట‌గాడు స‌రైన కార‌ణం లేకుండా ఐపీఎల్ నుంచి వైదొలిగితే రెండేళ్ల బ్యాన్ పడుతుంది. ఈ క్రమంలో అతడిపై కఠిన చర్యలకు భారత క్రికెట్ బోర్డు సిద్దమైనట్లు తెలుస్తోంది. బ్రూక్‌పై రెండేళ్ల పాటు బీసీసీఐ నిషేధం విధించినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఈ సస్పెన్షన్ గురించి బీసీసీఐ ఇప్పటికే ఇంగ్లండ్ వెల్స్ క్రికెట్ బోర్డుకు తెలియజేసినట్లు భారత క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.

"ఐపీఎల్ మెగా వేలానికి ముందు కొత్త రూల్స్ గురించి ప్రతీ ఆటగాడికి స్పష్టంగా తెలియజేశాము. ఈ రూల్స్ ప్రకారం.. హ్యారీ బ్రూక్‌పై రెండేళ్లపాటు నిషేదం విధించాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అధికారిక సమాచారాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో పాటు బ్రూక్‌కు అందించాము. 

బోర్డు తీసుకున్న నిర్ణయాలకు ప్రతీ ఆటగాడు కట్టుబడి ఉండాలి" అని బీసీసీఐ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో పేర్కొన్నారు. కాగా బీసీసీఐ నిర్ణయంతో ఐపీఎల్‌-2027 వరకు ఐపీఎల్‌లో ఆడే అవకాశం లేదు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది.  తొలి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌,రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.
చదవండి: IPL 2025: ల‌క్నోకు గుడ్ న్యూస్.. విధ్వంస‌క‌ర వీరుడు వ‌చ్చేస్తున్నాడు?
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)