Breaking News

BCCI: ఫిక్సింగ్‌ యత్నం.. బీసీసీఐ ఆగ్రహం.. అతడిపై నిషేధం

Published on Sat, 04/19/2025 - 10:16

ఫిక్సింగ్‌కు యత్నించిన గుర్మీత్‌ సింగ్‌ భమ్రా అనే వ్యక్తిపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) నిషేధం విధించింది. భమ్రా ముంబై టీ20 లీగ్‌లో సొబో సూపర్‌ సానిక్స్‌ అనే ఫ్రాంచైజీ కలిగి ఉన్నాడు. ఐదేళ్ల క్రితం అతడు ఆ లీగ్‌లో  ఫిక్సింగ్‌కు యత్నించినట్లు తేలడంతో బోర్డు అంబుడ్స్‌మన్‌ రిటైర్డ్‌ జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నిషేధం విధించారు. 

అయితే, భమ్రాపై ఐదేళ్లా లేదంటే జీవితకాల నిషేధమా అనేది తెలియాల్సి ఉంది. కాగా 2019 సీజన్‌లో సొబో సూపర్‌ సానిక్స్‌ ప్లేయర్లు ధవళ్‌ కులకర్ణి, భవిన్‌ ఠక్కర్‌లతో ఫిక్సింగ్‌ కోసం సంప్రదింపులు జరిపారు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన కులకర్ణి సహా ఠక్కర్‌లు ఫిక్సింగ్‌కు నిరాకరించారు. తదనంతరం ఈ విషయాన్ని బోర్డు అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ)కు తెలిపారు. 

సోనూ వాసన్‌ అనే వ్యక్తి ద్వారా గుర్మీత్‌ సింగ్‌ ఫిక్సింగ్‌ ప్రయత్నాలు చేశారు. సోనూ వాసన్‌ డబ్బు ఆశ చూపినా భవిన్‌ తలొగ్గలేదు. ఇద్దరు ఫిక్సింగ్‌కు ససేమిరా అనడంతో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. విచారణలో గుర్మీత్‌ దోషి అని తేలడంతో శిక్ష ఖరారు చేశారు.

ఇక భమ్రా జీటీ20 కెనడా లీగ్‌ (ప్రస్తుతం మనుగడలో లేదు)లోనూ భాగమయ్యాడు. కాగా కోవిడ్‌కు ముందు అతడు ముంబై టీ20 లీగ్‌ ఫ్రాంఛైజీ ఓనర్‌గా ఉండగా.. ప్రస్తుతం అతడిని లీగ్‌ నుంచి తొలగించారు.

ఐపీఎల్‌లోనూ ఫిక్సింగ్‌ కలకలం
కాగా ఐపీఎల్‌-2025లోనూ ఫిక్సింగ్‌కు అవకాశముందంటూ ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన బీసీసీఐ జట్ల యజమానులు, ఆటగాళ్లు, సిబ్బందికి కీలక సూచనలు చేసింది.

హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త గట్టిగానే ఫిక్సింగ్‌ యత్నాలు చేస్తున్నాడని.. ఆ వ్యక్తి గనుక సంప్రదిస్తే వెంటనే అవినీతి నిరోధక భద్రతా విభాగం దృష్టికి తీసుకురావాలని ఆదేశించింది. ప్లేయర్లతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఖరీదైన బహుమతుల పేరిట వల వేసే అవకాశం ఉందని.. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. 

సదరు వ్యాపారవేత్త గతంలోనూ ఇలాంటి అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డాడని.. అతడికి దూరంగా ఉండాలని హెచ్చరించింది. ఒకవేళ అతడు ఏ రకంగానైనా సంప్రదింపులు జరపాలని చూస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని ఆటగాళ్లను అప్రమత్తం చేసింది.

చదవండి: సచిన్‌ రికార్డు బద్దలు కొట్టిన పాటిదార్‌.. ఐపీఎల్‌ చరిత్రలో భారత తొలి బ్యాటర్‌గా
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)