Breaking News

WPL 2026: షెడ్యూల్‌ విడుదల చేసిన బీసీసీఐ.. ఈసారి రెండే!

Published on Sat, 11/29/2025 - 11:45

మహిళల ప్రీమియర్‌ లీగ్‌-2026 సీజన్‌ పూర్తి షెడ్యూల్‌ను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం విడుదల చేసింది. డబ్ల్యూపీఎల్‌ తాజా సీజన్‌ను జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 మధ్య నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇందులో రెండు డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు కూడా ఉండటం విశేషం.

ఇక ఈసారి నవీ ముంబై, వడోదర ఈసారి మ్యాచ్‌లన్నింటికి ఆతిథ్యం ఇవ్వనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. తొలి దశ మ్యాచ్‌లకు డీవై పాటిల్‌ స్టేడియం.. రెండో దశ మ్యాచ్‌లు, ప్లే ఆఫ్స్‌నకు కొటాంబి స్టేడియం వేదికలు అని తెలిపింది. కాగా గతేడాది ముంబై, వడోదర బెంగళూరు, లక్నోలు డబ్ల్యూపీఎల్‌ వేదికలుగా ఉన్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఈసారి 28 రోజుల పాటు సాగనున్న డబ్ల్యూపీఎల్‌-2026 (WPL 2026) టోర్నీకి ముంబై ఇండియన్స్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) మ్యాచ్‌తో తెర లేవనుంది. కాగా ముంబై ఇండియన్స్‌, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్‌, యూపీ వారియర్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌ ఈ టోర్నీలో భాగమైన విషయం తెలిసిందే. జట్ల ఖరారుకు సంబంధించి మెగా వేలం కూడా గురువారమే ముగిసింది. 

డబ్ల్యూపీఎల్‌-2026 పూర్తి షెడ్యూల్‌ ఇదే
👉జనవరి 9: ముంబై వర్సెస్‌ ఆర్సీబీ- నవీ ముంబై
👉జనవరి 10: యూపీ వర్సెస్‌ గుజరాత్‌- నవీ ముంబై
👉జనవరి 11: ముంబై వర్సెస్‌ ఢిల్లీ-నవీ ముంబై
👉జనవరి 12: ఆర్సీబీ వర్సెస్‌ యూపీ- నవీ ముంబై
👉జనవరి 13: ముంబై వర్సెస్‌ గుజరాత్‌- నవీ ముంబై
👉జనవరి 14: యూపీ వర్సెస్‌ ఢిల్లీ- నవీ ముంబై
👉జనవరి 15: ముంబై వర్సెస్‌ యూపీ- నవీ ముంబై
👉జనవరి 16: ఆర్సీబీ వర్సెస్‌ గుజరాత్‌- నవీ ముంబై
👉జనవరి 17: యూపీ వర్సెస్‌ ముంబై- నవీ ముంబై
👉జనవరి 17: ఢిల్లీ వర్సెస్‌ ఆర్సీబీ- నవీ ముంబై
👉జనవరి 19: గుజరాత్‌ వర్సెస్‌ ఆర్సీబీ- వడోదర
👉జనవరి 20: ఢిల్లీ వర్సెస్‌ ముంబై- వడోదర
👉జనవరి 22: గుజరాత్‌ వర్సెస్‌ యూపీ- వడోదర
👉జనవరి 24: ఆర్సీబీ వర్సెస్‌ ఢిల్లీ- వడోదర
👉జనవరి 26: ఆర్సీబీ వర్సెస్‌ ముంబై- వడోదర
👉జనవరి 27: గుజరాత్‌ వర్సెస్‌ ఢిల్లీ- వడోదర
👉జనవరి 29: యూపీ వర్సెస్‌ ఆర్సీబీ- వడోదర
👉జనవరి 30: గుజరాత్‌ వర్సెస్‌ ముంబై- వడోదర
👉ఫిబ్రవరి 1: ఢిల్లీ వర్సెస్‌ యూపీ- వడోదర
👉ఫిబ్రవరి 3: ఎలిమినేటర్‌- వడోదర
👉ఫిబ్రవరి 5: ఫైనల్‌- వడోదర. 


PC: BCCI
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)