Breaking News

IPL 2024: వారికి భారీ నజరానా.. బీసీసీఐ కీలక ప్రకటన

Published on Mon, 05/27/2024 - 11:54

పొట్టి క్రికెట్‌ ప్రేమికులకు రెండున్నర నెలలుగా వినోదం అందించిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 సీజన్‌కు ఆదివారంతో తెరపడింది. చెన్నై వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ విజయం సాధించింది.

ప్యాట్‌ కమిన్స్‌ బృందాన్ని ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి పదేళ్ల తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ క్రమంలో క్యాష్‌ రిచ్‌ లీగ్‌ పదిహేడో ఎడిషన్‌ చాంపియన్‌గా నిలిచిన కేకేఆర్‌కు రూ. 20 కోట్ల ప్రైజ్‌మనీ దక్కగా.. రన్నరప్‌ సన్‌రైజర్స్‌కు రూ. 12.5 కోట్లు అందాయి.

 

అన్‌సంగ్‌ హీరోలకు భారీ నజరానా
ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా కీలక ప్రకటన చేశారు. ఐపీఎల్‌ పదిహేడో సీజన్‌ ఇంతగా విజయవంతం కావడం వెనుక ఉన్న ‘అన్‌సంగ్‌ హీరో’లకు భారీ మొత్తం కానుకగా ప్రకటించారు.

గ్రౌండ్స్‌మెన్‌, పిచ్‌ క్యూరేటర్లకు రూ. 25 లక్షల చొప్పున బహుమతిగా అందించనున్నట్లు ఎక్స్‌ వేదికగా జై షా వెల్లడించారు. ‘‘తాజా టీ20 సీజన్‌ను ఇంతగా సక్సెస్‌ కావడానికి గ్రౌండ్‌ సిబ్బంది నిర్విరామంగా పనిచేయడమూ కారణమే.

వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా అద్భుతమైన పిచ్‌లను తయారు చేయడంలో వారు సఫలమయ్యారు. అందుకే గ్రౌండ్స్‌మెన్‌, క్యూరేటర్ల శ్రమను గుర్తించి వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించాం.

ఈ సీజన్‌లో రెగ్యులర్‌గా ఐపీఎల్‌ మ్యాచ్‌లు సాగిన 10 వేదికల సిబ్బందికి ఒక్కొక్కరికి రూ. 25 లక్షలు, అదనంగా సేవలు అందించిన మూడు వేదికల సిబ్బందికి రూ. 10 లక్షల చొప్పున అందజేస్తాం. మీ కఠిన శ్రమ, అంకితభావానికి థాంక్యూ’’ అని జై షా సోమవారం ట్వీట్‌ చేశారు.

వేదికలు ఇవే
కాగా ఐపీఎల్‌-2024 సీజన్‌లో ముంబై(ముంబై ఇండియన్స్‌), ఢిల్లీ(ఢిల్లీ క్యాపిటల్స్‌), చెన్నై(చెన్నై సూపర్‌ కింగ్స్‌), కోల్‌కతా(కోల్‌కతా నైట్‌ రైడర్స్‌), చండీఘర్(పంజాబ్‌ కింగ్స్‌)‌, హైదరాబాద్(సన్‌రైజర్స్‌)‌, బెంగళూరు(ఆర్సీబీ), లక్నో(లక్నో సూపర్‌ జెయింట్స్‌), అహ్మదాబాద్(గుజరాత్‌ టైటాన్స్‌)‌, జైపూర్‌(రాజస్తాన్‌ రాయల్స్‌)లలో రెగ్యులర్‌గా మ్యాచ్‌లు జరగగా.. గువాహటి(రాజస్తాన్‌ రాయల్స్‌), విశాఖపట్నం(ఢిల్లీ క్యాపిటల్స్‌), ధర్మశాల(పంజాబ్‌ కింగ్స్‌)‌ మైదానాల్లోనూ మ్యాచ్‌లు నిర్వహించారు.

చదవండి: SRH: అందుకే ఓడిపోయాం.. మా వాళ్లు మాత్రం సూపర్‌: కమిన్స్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)