టీమిండియాపై అద్భుత ప్రదర్శన.. బంగ్లాదేశ్‌ జట్టుకు భారీ నజరానా! ఎంతంటే?

Published on Mon, 07/24/2023 - 08:54

స్వదేశంలో భారత మహిళల జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌ను 1-1తో బంగ్లాదేశ్‌ డ్రాగా ముగించిన సంగతి తెలిసిందే. ఢాకా వేదికగా జరిగిన ఆఖరి వన్డే టై కావడంతో ట్రోఫీని ఇరు జట్లు సంయుక్తంగా పంచుకున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. టీమిండియా వంటి పటిష్ట జట్టుపై అద్బుత ప్రదర్శరన కనబరిచిన తమ జట్టుకు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు భారీ నజరానా ప్రకటించింది. 

తమ మహిళల జట్టుకు 35 లక్షల టాకాలు(భారత కరెన్సీలో సూమారు రూ.27 లక్షలు) ఇవ్వనున్నట్లు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. అదే విధంగా వన్డేల్లో బంగ్లాదేశ్‌ మహిళల జట్టు తరపున తొలి సెంచరీ సాధించిన ఫర్గానా హోక్‌పై బీసీబీ ఛీప్‌ నజ్ముల్ హసన్ పాపోన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఫర్గానా అద్బుతమైన బ్యాటర్‌ అని, బంగ్లా క్రికెట్‌ను మరో స్ధాయికి తీసుకువెళ్తుందని అతడు కొనియాడాడు.

"సాధారణంగా మేము సిరీస్‌ గెలిస్తే మా జట్లకు బోనస్‌ ఇస్తాం. కానీ భారత్‌తో సిరీస్‌ డ్రా అయినప్పటికీ మా జట్టుకు రివార్డు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ సిరీస్‌లో సిరీస్‌లో మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా భారత్‌పై మేము తొలి వన్డే విజయం సాధించాము. అదే విధంగా సెంచూరియన్ ఫర్గానా హోక్ ​​వంటి వ్యక్తిగత ప్రదర్శనలు కూడా ఉన్నాయి.

అందుకే మా ప్లేయర్స్‌కు 25 లక్షల టాకాలు ఇవ్వాలని అనుకుంటున్నా​ం. అదేవిధంగా సెంచరీతో చెలరేగిన ఫర్గానా 2 లక్షల టాకాలు, వ్యక్తిగత ప్రదర్శన మిగితా ప్లేయర్స్‌కు రివార్డు ఇవ్వనున్నాం. మరోవైపు కోచింగ్‌ స్టాప్‌ను కూడా ఇందులో భాగం చేయాలి అనకుంటున్నాం. మొత్తంగా  35 లక్షల టాకాలు రివార్డు రూపంలో ఇవ్వనున్నాం" అని నజ్ముల్ హసన్ పాపోన్ మీడియా సమావేశంలో పేర్కొన్నాడు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)