Breaking News

నెసర్‌ ఆల్‌రౌండ్‌ షో.. స్టీవ్‌ స్మిత్‌ లేని సిక్సర్స్‌ను కొట్టి ఫైనల్‌కు చేరిన హీట్‌

Published on Thu, 02/02/2023 - 17:36

బిగ్‌బాష్‌ లీగ్‌ 2022-23 సీజన్‌లో ఫైనల్‌ బెర్తులు ఖరారయ్యాయి. ఇవాళ (ఫిబ్రవరి 2) జరిగిన ఛాలెంజర్‌ గేమ్‌లో బ్రిస్బేన్‌ హీట్‌.. సిడ్నీ సిక్సర్స్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి, తుది సమరంలో పెర్త్‌ క్కార్చర్స్‌తో ఢీకి సిద్ధమైంది. లోకల్‌ (ఆసీస్‌) స్టార్‌ ఆటగాళ్లంతా ఇండియా టూర్‌ (4 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌)కు వెళ్లడంతో చప్పగా సాగిన ఇవాల్టి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సిక్సర్స్‌.. కున్నెమన్‌ (3/17), స్పెన్సర్‌ జాన్సన్‌ (3/28), మైఖేల్‌ నెసర్‌ (2/28), మెక్‌ స్వీనీ (1/21) ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 116 పరుగులు మాత్రమే చేసింది.

డేనియల్‌ హ్యూస్‌ (23) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 117 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హీట్‌ను.. నెసర్‌ (32 బంతుల్లో 48 నాటౌట్‌; 7 ఫోర్లు) అజేయమైన ఇన్నింగ్స్‌తో విజయతీరాలకు చేర్చాడు. ఆరంభంలో ఈ జట్టు కూడా వడివడిగా వికెట్లు కోల్పోయినా నెసర్‌ ఒక్కడే నిలబడి, ఒంటిచేత్తో తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. హీట్‌ టీమ్‌ 18.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జోష్‌ బ్రౌన్‌ (20) ఓ మోస్తరుగా రాణించాడు. సిక్సర్స్‌ బౌలర్లలో నవీద్‌ 2, స్టీవ్‌ ఓకీఫ్‌, సీన్‌ అబాట్‌, డ్వార్షుయిష్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో చెలరేగిన నెసర్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. ఫిబ్రవరి 4న జరిగే ఫైనల్లో బ్రిస్బేన్‌ హీట్‌ టీమ్‌.. పెర్త్‌ స్కార్చర్స్‌తో టైటిల్‌ కోసం పోరాడుతుంది. ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రారంభమవుతుంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌కు ముందు వరకు స్టీవ్‌ స్మిత్‌, ఉస్మాన్‌ ఖ్వాజా, డేవిడ్‌ వార్నర్‌, ట్రవిస్‌ హెడ్‌ లాంటి విధ్వంసకర వీరుల మెరుపులతో బీబీఎల్‌ కళకళలాడింది. ప్రస్తుతం ఈ ఆటగాళ్లంతా భారత పర్యటనలో ఉండటంతో లీగ్‌ కళావిహీనంగా, ఎలాంటి మెరుపులు లేకుండా చప్పగా సాగుతుంది. ఫైనల్‌ మ్యాచ్‌ కూడా దాదాపుగా ఇలాగే సాగవచ్చని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు.    


 

Videos

అందర్నీ కొనేసింది.! షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాధితుడు

పాన్ ఇండియా బరిలోకి దిగుతున్నారా? డిసెంబర్ లో ఒకేసారి సినిమాలు

రోజులన్నీ ఒకేలా ఉండవు.. చంద్రబాబు లాంటోడే జైలుకు వెళ్ళాడు నువ్వెంత

తాడిపత్రిలో టెన్షన్.. టెన్షన్ YSRCP కార్యాలయానికి తాళం వేసిన JCవర్గీయులు

DSC అక్రమాలపై లోకేష్‌ జైలుకు వెళ్లడం పక్కా

సెప్టెంబర్లోనే నా పాదయాత్ర రాసిపెట్టుకోండి హిస్టరీ రిపీట్ చేద్దాం

మిడ్ నైట్ గుస గుసలు.. ఆటను రామ్ ప్రసాద్ మారుస్తున్నాడా?

2019 హిస్టరీ రిపీట్ చేద్దాం.. జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం

సాక్షి సంచలన రిపోర్ట్...బయటపడ్డ మరో వ్యక్తి

భారీగా తగ్గిన బంగారం ధరలు తులం ఎంతంటే?

Photos

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)

+5

‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)