Breaking News

టీమిండియాకు చుక్కలు చూపించిన బంగ్లా బౌలర్లు

Published on Tue, 07/11/2023 - 15:24

3 టీ20లు, 3 వన్డేల సిరీస్‌ల కోసం భారత మహిళల క్రికెట్‌ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ఇందులో భాగంగా బంగ్లాదేశ్‌-టీమిండియాల మధ్య ఇవాళ (జులై 11) రెండో టీ20 జరుగుతుంది. ఢాకా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియాను బంగ్లాదేశ్‌ బౌలర్లు కట్టడి చేశారు. బంగ్లా బౌలర్లు మూకుమ్మడిగా రాణించి టీమిండియాకు చుక్కలు చూపించారు.

వీరి ధాటికి టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 95 పరుగలు మాత్రమే చేయగలిగింది. బంగ్లా బౌలర్లలో సుల్తానా ఖాతూన్‌ 3 వికెట్లతో రెచ్చిపోగా.. ఫాతిమా ఖాతూన్‌ 2, మరూఫా అక్తెర్‌, నమిద అక్తెర్‌, రబెయా ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. భారత బ్యాటర్లలో ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కును దాటలేకపోయారు. ఓపెనర్‌ షఫాలీ వర్మ చేసిన 19 పరుగులే టాప్‌ భారత ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోర్‌గా నిలిచింది.

షఫాలీ సహా స్మృతి మంధన (13), యస్తిక భాటియా (11), దీప్తి శర్మ (10), అమన్‌జోత్‌ కౌర్‌ (14) రెండంకెల స్కోర్లు చేశారు. టీమిండియా స్టార్‌ బ్యాటర్లు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ డకౌట్‌ కాగా.. జెమీమా రోడ్రిగెజ్‌ (8), హర్లీన్‌ డియోల్‌ (6) నిరాశపరిచారు. కాగా, ఈ సిరీస్‌లో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదే వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 


 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)