Breaking News

T20 WC 2024: గెలిచి నిలిచిన బంగ్లాదేశ్‌

Published on Fri, 06/14/2024 - 03:31

కింగ్స్‌టౌన్‌: టి20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ గెలిచి నిలిచింది. సూపర్‌–8 అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు గురువారం జరిగిన పోరులో బంగ్లా 25 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ గెలుపుతో గ్రూప్‌ ‘డి’లోని మరో జట్టు శ్రీలంక అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. టాస్‌ నెగ్గిన డచ్‌ జట్టు ఫీల్డింగ్‌కు మొగ్గుచూపగా... తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 

మిడిలార్డర్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ షకీబుల్‌ హసన్‌ (46 బంతుల్లో 64 నాటౌట్‌; 9 ఫోర్లు) రాణించాడు. టాపార్డర్‌లో కెపె్టన్‌ నజ్ముల్‌ హోస్సేన్‌ (1), లిటన్‌ దాస్‌ (1)ల వైఫల్యంతో 23 పరుగులకే బంగ్లా 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మరో ఓపెనర్‌ తంజిద్‌ హసన్‌ (26 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి షకీబ్‌ మూడో వికెట్‌కు 48 పరుగులు జోడించాడు. 38 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు.

ఆఖర్లో మహ్మూదుల్లా (21 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), జాకిర్‌ అలీ (7 బంతుల్లో 14 నాటౌట్‌; 3 ఫోర్లు) ధాటిగా ఆడటంతో బంగ్లాదేశ్‌ 150 పైచిలుకు స్కోరు చేయగలిగింది. ఆర్యన్‌ దత్, పాల్‌ వాన్‌ మీకెరన్‌ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన నెదర్లాండ్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 134 పరుగులు చేసి ఓడింది. 

సైబ్రాండ్‌ (22 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్‌), విక్రమ్‌జీత్‌ సింగ్‌ (16 బంతుల్లో 26; 3 సిక్స్‌లు), కెప్టెన్   స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (23 బంతుల్లో 25; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడినప్పటికీ కీలకమైన దశలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో పరాజయం తప్పలేదు. రిషాద్‌ హోస్సేన్‌ 3, టస్కిన్‌ అహ్మద్‌ 2 వికెట్లు తీశారు.   

టి20 ప్రపంచకప్‌లో నేడు
అఫ్గానిస్తాన్‌ X పాపువా న్యూగినీ 
వేదిక: ట్రినిడాడ్‌; ఉదయం గం. 6 నుంచి
అమెరికా X ఐర్లాండ్‌ 
వేదిక: లాడెర్‌హిల్‌; రాత్రి గం. 8 నుంచిస్టార్‌ స్పోర్ట్స్, హాట్‌ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)