Breaking News

‘రోహిత్‌, కోహ్లిలే కాదు.. టీమిండియాకు అతడూ ముఖ్యమే’

Published on Mon, 09/23/2024 - 14:58

టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌పై బంగ్లాదేశ్‌ వెటరన్‌ క్రికెటర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత క్రికెట్‌ జట్టుకు అశూ సేవలు మరువలేనివని.. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలకు అతడు ఏమాత్రం తీసిపోడని కొనియాడాడు. తన దృష్టిలో టీమిండియాలో అత్యంత ముఖ్యమైన ఆటగాడు అతడేనని తమీమ్‌ ఇక్బాల్‌ పేర్కొన్నాడు.

బంగ్లాదేశ్‌తో టీమిండియా తొలి టెస్టులో అశ్విన్‌ సత్తా చాటిన విషయం తెలిసిందే. చెన్నైలోని సొంతమైదానం చెపాక్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో విలువైన సెంచరీ చేయడంతో పాటు.. ఆరు వికెట్లు తీసి బంగ్లాదేశ్‌ ఓటమిని శాసించాడు. భారత్‌ గెలుపులో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

ఆరు శతకాలు.. 522 వికెట్లు
ఈ క్రమంలో టెస్టు క్రికెట్‌లో ఇప్పటికే 522 వికెట్లతో పాటు... 3422 పరుగులు పూర్తి చేసుకున్నాడు ఈ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌. ఇందులో ఆరు సెంచరీలు ఉండం విశేషం. ఇక గతంలోనూ పలు టెస్టుల్లో టీమిండియా చిక్కుల్లో పడ్డవేళ ఆపద్భాందవుడిలా తన ఇన్నింగ్స్‌తో గట్టెక్కించిన సందర్భాలూ ఉన్నాయి.

ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ మాజీ కెప్టెన్‌, కామెంటేటర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ మాట్లాడుతూ.. ‘‘తొలి టెస్టులో అశ్విన్‌ అద్బుతంగా ఆకట్టుకున్నాడు. స్పెషలిస్టు బ్యాటర్‌ మాదిరి ఇన్నింగ్స్‌ ఆడాడు. నేను విదేశీయుడిని.. అయితే, నాలాగే చాలా మందికి ఎక్కువగా విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ పేర్లే వినిపిస్తున్నాయి.

రోహిత్‌, కోహ్లిలే కాదు.. టీమిండియాకు అతడూ ముఖ్యమే
అయితే, నా దృష్టిలో మాత్రం వాళ్లిద్దరితో పాటు టీమిండియాకు అశ్విన్‌ కూడా అంతే ముఖ్యం. కానీ.. అశూ లాంటి వాళ్లు సెంచరీ చేసినపుడు.. ఐదు లేదా ఆరు వికెట్లు పడగొట్టినపుడు మాత్రమే మనం వాళ్ల గురించి మాట్లాడతాం. 

అయితే, భారత క్రికెట్‌ జట్టు విజయపథంలో నడవడంలో అశ్విన్‌ వంటి మేటి ఆటగాళ్ల కృషి ఎంతగానో ఉంది’’ అని పేర్కొన్నాడు. రోహిత్‌, కోహ్లి మాదిరే అతడూ టాప్‌ ప్లేయరేనని తమీమ్‌ ఇక్బాల్‌ ఈ సందర్భంగా అశ్విన్‌ను ప్రశంసించాడు.

చదవండి: ఇరగదీస్తున్న ఆసియా దేశాలు.. ఒక్క పాక్‌ మినహా..!

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)