Breaking News

క్రికెట్ చ‌రిత్ర‌లోనే అత్యంత చెత్త రివ్యూ.. వీడియో వైర‌ల్‌

Published on Sat, 03/30/2024 - 17:41

చటోగ్రామ్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న రెండు టెస్టు మొద‌టి రోజు ఆట‌లో శ్రీలంక పై చేయి సాధించింది. తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి లంక 4 వికెట్లు న‌ష్టానికి 314 ప‌రుగులు చేసింది. కుశాల్ మెండిస్‌(93), క‌రుణ‌ర‌త్నే(86), నిషాన్ మదుష్కా(57) హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు. బంగ్లా బౌల‌ర్లలో హ‌స‌న్ మ‌హ్మ‌ద్ రెండు, ష‌కీబ్ ఆల్ హ‌స‌న్ త‌లా రెండు వికెట్లు సాధించారు.

అయితే తొలి రోజు ఆట‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ న‌జ్ముల్ హుస్సేన్ షాంటో తీసుకున్న ఓ రివ్యూ ప్ర‌స్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. శ్రీలంక ఇన్నింగ్స్ 44 ఓవ‌ర్ వేసిన  స్పిన్నర్ తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో మూడు బంతిని కుశాల్ మెండిస్ ఆఫ్ సైడ్ వైపు డిఫెన్స్ ఆడాడు. కానీ బౌల‌ర్, స్లిప్‌లో ఉన్న బంగ్లా కెప్టెన్ షాంటో బంతి బ్యాట్‌కు కాకుండా ప్యాడ్‌కు త‌గిలింద‌ని భావించి ఎల్బీకి అప్పీల్ చేశారు.

అంపైర్ మాత్రం నాటౌట్ అంటూ త‌లఊపాడు. ఈ క్ర‌మంలో షాంటో బౌల‌ర్‌తో సంప్ర‌దించి రివ్యూకు వెళ్లాడు. అయితే బంతి బ్యాట్‌కు స్ప‌ష్టంగా తాకుతున్న‌ప్ప‌టికి షాంటో రివ్యూకు వెళ్ల‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. రిప్లేలో కూడా బంతి బ్యాట్‌కు మ‌ధ్య‌లో తాకిన‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపించింది. దీంతో అంతా ఒక్క‌సారిగా న‌వ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇది చూసిన నెటిజ‌న్లు  క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఇది అత్యంత చెత్త రివ్యూ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)